»   » రెండో ట్రైలర్ కూడా ఇరగతీసింది (వీడియో)

రెండో ట్రైలర్ కూడా ఇరగతీసింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : కొన్ని సినిమాల కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తూంటారు. అలాంటి సినిమాలు రూపొదించటంలో అనురాగ్‌ కశ్యప్‌ ముందుంటారు. ఆయన మరోసారి 'బాంబే వెల్వెట్‌'తో మాయ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన ఇప్పటికే ఈ చిత్రం గురించి ఓ ట్రైలర్ వదిలి అందరి దృష్టిని తన సినిమా వైపు తిప్పుకున్నారు. ఇప్పుడు సెకండ్ ట్రైలర్ వదిలారు. ఆ ట్రైలర్ మీరూ చూడండి.

ఇప్పటికే విడుదలైన తొలి ట్రైలర్‌లో కనిపించిన దృశ్యాలు, పాత్రల నైజాలు 60-70ల నాటి కాలాన్ని గుర్తు చేశాయి. నటీనటుల వేషధారణతోపాటు, సెట్‌లనూ రూపొందించడంలోనూ అనురాగ్‌ చాలా జాగ్రత్త వహించాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్‌ విడుదలైంది. ఇందులోనూ అనురాగ్‌ మార్క్‌ కనిపిస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సినిమా ప్రధాన భాగం 'బాంబే వెల్వెట్‌' అనే నైట్‌ క్లబ్‌ నేపథ్యంలో జరుగుతుందట. అందుకే సినిమాకు ఆ పేరు పెట్టారట. రణ్‌బీర్‌ కపూర్‌, అనుష్క శర్మ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ విలన్ గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో మొట్టమొదటిసారి బాలీవుడ్ బబ్లీ హీరో రణ్ బీర్ కపూర్ యాక్షన్ హీరో పాత్ర పోషించాడు. ఈ సినిమాలో రణ్బీర్ జానీబాలరాజ్ అనే బాక్సర్ పాత్రలో నటించాడు. అనుష్క శర్మ రోజీ అనే గాయని పాత్రలో నటించింది. బాలీవుడ్ అగ్ర దర్శకుడు కరణ్ జోహార్ మొదటిసారి తెరపై కనిపించనున్నారు. ఆయన విలన్ పాత్రలో నటించారు.

Bombay Velvet redeems itself with second trailer

చరిత్రకారుడు జ్ఞాన్‌ ప్రకాశ్‌ పుస్తకం 'ముంబయి ఫేబుల్స్‌' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో కేకే మీనన్, బాలీవుడ్ మాజీ నాయిక రవీనాటాండన్ నటించారు.

‘బాంబే వెల్వెట్‌'లో జాజ్‌ సింగర్‌ కేరక్టర్‌లో అలరించబోతున్న అనుష్క శర్మ. ‘ఎన్‌హెచ్‌ 10'లో ధైర్యవంతురాలైన వివాహితగా ఆకట్టుకున్న ఆమె ఈ చిత్రంతో తనేంటో అందరికీ మరోసారి తెలుస్తుందని చెప్తోంది. ఇక ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌' సినిమాలో పరిణిత ప్రేమికురాలిగా ప్రేక్షకుల హృదయాల్ని దోచుకోనున్నది. ఇలా ఒకదానికొకటి సంబంధంలేని పాత్రలు చేస్తోంది అనుష్క.

అనుష్క శర్మ మాట్లాడుతూ... ‘‘సినిమా చూసిన మరుసటి రోజే ప్రేక్షకులు మరిచిపోయే పాత్రలను చేయాలని నేననుకోవట్లేదు. సినిమాకి నా పాత్రతో ఎంతో కొంత ప్రయోజనం చేకూరాలి. కేవలం టైటిల్స్‌లో నా పేరుంటే చాలని ఎప్పుడూ అనుకోను. సినిమాకి నా వంతు భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తాను. ఇది జరిగినంత కాలం నేను రకరకాల పాత్రలు చేస్తుంటాను, నన్ను నేను ఆ పాత్రలతో పరీక్షించుకుంటూనే ఉంటాను'' అని తన కెరీర్‌ ఎలా ఉండాలనుకుంటున్నదో తేల్చి చెప్పింది.

English summary
The cast of the film revealed the second trailer of Bombay Velvet. While a second trailer of the same film carries with it the risk of looking like a mere shifting around of scenes, this trailer, however, tries to reach for more. It tell us more about the emotions in the film; from greed, passion, love, anger, it's all there and it gives you an instant 70s Hindi cinema nostalgia.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu