»   » అంబానీ గిఫ్ట్ చూడగానే ఏడ్చేసిన బోని కపూర్!

అంబానీ గిఫ్ట్ చూడగానే ఏడ్చేసిన బోని కపూర్!

Subscribe to Filmibeat Telugu

దివంగత నటి శ్రీదేవి మరణంతో బోని కపూర్ కు పరామర్శలు కొనసాగుతున్నాయి. బోని కపూర్ కుటుంబం అనిల్ అంబానీ కుటుంబంతో కూడా సన్నిహితంగా ఉంటుంది.శ్రీదేవి మృతి తరువాత బోని కపూర్ దుఃఖసాగరంలో మునిగిపోయారు. కాగా శ్రీదేవి ఉన్నపుడు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీతో సన్నిహితంగా మెలిగేది. వీరిద్దరూ కలసి పార్టీలకు, వేడుకలకు హాజరయ్యే వారు. కాగా టీనా అంబానీ చివరగా శ్రీదేవితో కలసి దిగిన ఫొటోకి వెండి ప్రేమ్ కట్టించి బోనికపూర్ కు జ్ఞాపికగా అందజేశారు.

టీనా అంబానీ బర్త్ డే పార్టీ

టీనా అంబానీ బర్త్ డే పార్టీ

ఫిబ్రవరి 11 న టీనా అంబానీ తన 61 వ జన్మ దిన వేడుకల్ని జరుపుకున్నారు. ఈ వేడుకకు బోనికపూర్, శ్రీదేవి హాజరయ్యారు.

చివరి ఫోటో.. వెండి ఫ్రేమ్

చివరి ఫోటో.. వెండి ఫ్రేమ్

ఈ పార్టీలో బోనికపూర్, శ్రీదేవి కలసి టీనా అంబానీతో ఫోటో దిగారు. ఆ ఫోటోకు టీనా అంబానీ వెండి ప్రేమ్ కట్టించి ఇటీవల బోనికపూర్ కు అందజేశారు.

ఫోటో చూడగానే

ఫోటో చూడగానే

ఫోటో చూసిన వెంటనే బోనికపూర్ తీవ్ర భావోద్వేగంతో ఏడ్చేసాని సమాచారం. శ్రీదేవి మరణంతో ఇప్పటికే ఆయన బోలెడు దుఃఖంతో ఉన్నారు. శ్రీదేవి చిరునవ్వుతో ఉన్న ఫొటో చూసే సరికి ఆయన భావోద్వేగం ఆపుకోలేకపోయారట.

టీనా అంబానీతో శ్రీదేవి స్నేహం

టీనా అంబానీతో శ్రీదేవి స్నేహం

టీనా అంబానీ, శ్రీదేవి సన్నిహితంగా మెలిగారు. శ్రీదేవితో తనకు ఇదే చివరి ఫోటో అవుతుందని తాను ఊహించలేదని టీనా అంబానీ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు.

English summary
Boney Kapoor CRIED After Receiving Tina Ambani's Gift. Tina Ambani's last photo with Sridevi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu