»   » బోని కపూర్‌ని కదిలిస్తున్న స్నేహితులు..సొంత ప్రయత్నం, సముద్రమంత సాధ్యమా!

బోని కపూర్‌ని కదిలిస్తున్న స్నేహితులు..సొంత ప్రయత్నం, సముద్రమంత సాధ్యమా!

Subscribe to Filmibeat Telugu

లెజెండ్రీ నటి శ్రీదేవి మరణం అభిమానులకు దిగ్భ్రాంతికర ఘటన. ఆమె కుటుంబానికి తీయని శోకం. శ్రీదేవి జ్ఞాపకాలని స్మరించుకుంటూ అభిమానులు షాక్ నుంచి నెమ్మదిగా బయట పడుతున్నారు. కానీ బోని కపూర్ కుటుంబం మాత్రం ఆ శోకం నుంచి ఇంకా బయట పడలేదు. బోని కపూర్ కుటుంబానికి ప్రముఖుల నుంచి ఇంకా పరామర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

Boney Kapoor Finally Responds On Sridevi's Loss
 అభిమానులు ఇప్పుడిప్పుడే

అభిమానులు ఇప్పుడిప్పుడే

అతిలోక సుందరికి అన్నియావత్ భారతం మొత్తం అభిమానులు ఉన్నారు. శ్రీదేవి అన్ని చిత్ర పరిశ్రమల్లో తిరుగులేని జయకేతనం ఎగురవేసింది. శ్రీదేవి మృతి షాక్ నుంచి అభిమానులు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు.

 కుటుంబానికి తీరని శోకం

కుటుంబానికి తీరని శోకం

శ్రీదేవి కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా శోకాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. శ్రీదేవి మరణం గురించి బోని కపూర్ ఇంత వరకు మీడియాతో నేరుగా మాట్లాడింది లేదు.

దగ్గరే ఉండడంతో ఇంకా తేరుకోలేదు

దగ్గరే ఉండడంతో ఇంకా తేరుకోలేదు

శ్రీదేవి ఆకస్మికంగా ఊహించని రీతిలో మరణించడం, ఈ ఘటనని ముందుగా తానే ఫేస్ చేయడంతో బోని కపూర్ జీర్ణించుకోలేకపోతున్నాడు అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

తుదిశ్వాస వరకు అతడితోనే

తుదిశ్వాస వరకు అతడితోనే

బోని కపూర్, శ్రీదేవి 22 ఏళ్ల దాంపత్యం అన్యోన్యంగా సాగింది. శ్రీదేవి మరణించే సమయంలో కూడా బోనికపూర్ ఆమెతోనే ఉన్నారు.

ఇప్పుడిప్పుడే అతడి స్నేహితులు

ఇప్పుడిప్పుడే అతడి స్నేహితులు

శ్రీదేవి మరణించిన విషయాన్ని బోని కపూర్ జీర్ణించుకోవడం కష్టమే.అతడిని తిరిగి మాములు మనిషిని చేయడానికి స్నేహితులు ప్రయత్నిస్తున్నారు. ఒక్కొక్కరుగా అతడిని పరామర్శించి ఓదారుస్తున్నారు.

శ్రీదేవి బయోపిక్

శ్రీదేవి బయోపిక్

శ్రీదేవి మృతి తరువాత వెంటనే ఆమె బయోపిక్ వార్తలు తెరపైకి వచ్చాయి. శ్రీదేవి జీవితం చాలా ఆసక్తికరమైన కథ. కాబట్టి సినిమా తీయడానికి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 బోని కపూర్ ని అడుగుతున్న స్నేహితులు

బోని కపూర్ ని అడుగుతున్న స్నేహితులు

బోనికపూర్ స్నేహితులు శ్రీదేవి బయోపిక్ గురించి అతడితో ప్రస్తావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయంలో బోని కపూర్ ఆలోచన మరోలా ఉన్నట్లు తెలుస్తోంది.

సముద్రమంత కాబట్టి

సముద్రమంత కాబట్టి

శ్రీదేవి జీవితం, ఆమె సాధించిన విజయాలు సముద్రమంతవి అనడంలో అతిశయోక్తి కాదు. బాలనటిగా ప్రస్థానం మొదలుపెట్టిన శ్రీదేవి అన్ని చిత్ర పరిశ్రమల్లో తిరుగులేని హీరోయిన్ గా ఖ్యాతి గడించింది. ఆమె జీవితాన్ని కేవలం 2 గంటల సినిమాగా చూపించడం సాధ్యం కాదని పరామర్శకు వెళ్లిన అత్యంత సన్నిహితులతో బోని అభిప్రాయ పడ్డారట.

 డాక్యుమెంటరీ

డాక్యుమెంటరీ

రెండు గంటల సినిమా అయితే కీలక అంశాలన్నీ మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి శ్రీదేవి జీతంలో ప్రతి విషయాన్ని వివరంగా డాక్యుమెంటరీ రూపొందించాలని అయన అభిప్రాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి.

శేఖర్ కపూర్ తో మంతనాలు

శేఖర్ కపూర్ తో మంతనాలు

ఈ విషయం గురించి బోని కపూర్ తన స్నేహితుడు, దర్శకుడు శేఖర్ కపూర్ తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. సొంతంగా వీరిద్దరూ ఈ ప్రాజెక్టుని చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Boney Kapoor, Shekhar Kapoor to make a Sridevi's documentary. Boney dont want to make movie on Sridevi life
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu