twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చ..! పనిమనుషులనీ వదల్లేదు.... బాలీవుడ్ పెద్దల చిన్న బుద్దులు

    బుక్ మై భాయ్.కాం సంస్థ అధినేత సిన్హాల్‌ ట్విట్టర్ పోస్ట్ బాలీవుడ్ సెలబ్రిటీల పరువు తీసేలాఉంది, పైకి పెద్దమనుషులకు లోలోపల ఉండే చిన్న బుద్దులని అతను బయట పెట్టారు.

    |

    బుక్ మై భాయ్.కాం... ముంబై లాంటి మహా నగరం లో పని మనిషిని వెతుక్కోకుండా జస్ట్ ఒక్క క్లిక్ తో మీకు పనిమనిషిని ఆరెంజ్ చేసే సంస్థ. ఇక్కడ మీకు కావాల్సిన అర్హతలున్న పనిమనుషులు దొరుకుతారు. 2015 లోనే మొదలైన ఈ సంస్థ తొందరలోనే పది వేల మంది కి పైగా కస్టమర్లనీ అదే స్థాయిలో ఉధ్యోగులనీ సాధించింది. ఇన్ని ఇళ్ళలోనూ ఎప్పుడూ ఒక్క భాయ్ (పనిమనిషిని ఇలా పిలుస్తారు) మీద కూడా కస్టమర్లు కంప్లైంట్ చేయ్యలేదని గర్వంగా చెప్పుకుంటారీ సంస్థ నిర్వాహకులు. ఈ స్టార్టప్ తర్వాత బుక్ మై దీ దీ అనీ, బుక్ యువర్ మెయిడ్ అనీ మరికొన్ని సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి గానీ మార్కెట్ లో వాటి స్థానం అంతంత మాత్రమే. అయితే ఇప్పుడు ఈ సంస్థ అధినేత సిన్హాల్‌ ట్విట్టర్ పోస్ట్ బాలీవుడ్ సెలబ్రిటీల పరువు తీసేలాఉంది, పైకి పెద్దమనుషులకు లోలోపల ఉండే చిన్న బుద్దులని అతను బయట పెట్టారు. అయితే కొన్ని లీగల్ సమస్యల వల్ల పేర్లు వెళ్ళడించలేదు గానీ వాళ్ళ చేష్టలను మాత్రం ఇలా పబ్లిక్ లో బయట పెట్టారు....

    సెలబ్రిటీ 1:

    సెలబ్రిటీ 1:

    ఈ నటి ఇంట్లో పనిచేసే వ్యక్తి తల్లి చనిపోతే కర్మకాండలకు వెళ్లనివ్వలేదని చెప్పారు. ఆఖరి చూపులకు వెళ్లాలంటే తన స్ధానంలో వేరే వారిని ఉంచి వెళ్లాలని ఆమె ఆర్డరేశారని తెలిపారు. ఆమె ప్రవర్తించిన తీరు అమానుషమని.. ఇంతకంటే ఆమె గురించి తానేం మాట్లాడలేనని అన్నారు.

    సెలబ్రిటీ 2:

    సెలబ్రిటీ 2:

    రూ.3 కోట్ల కారు కలిగిన ఓ యజమాని.. తన వద్ద పనిచేసే వ్యక్తికి భోజనం పెట్టలేనని చెప్పడం తనకు బాధ కలిగించిందని చెప్పారు. ఊదారత కలిగిన ఆయన టీ తాగి, రోజుకు మూడు సార్లు బ్రెడ్‌ తినాలని మెయిడ్‌తో చెప్పినట్లు వివరించారు.

    సెలబ్రిటీ 3:

    సెలబ్రిటీ 3:

    ఈ సెలబ్రిటీ మెయిడ్‌ను శారీరకంగా హింసించడం తనను ఆందోళనకు గురి చేసిందని చెప్పారు. సదరు సెలబ్రిటీపై కంపెనీ ఫిర్యాదు చేయడానికి ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అయితే, కేసు నమోదయిన దగ్గర నుంచి స్టేషన్‌కు వెళ్లాల్సివస్తుందని.. తాను అలా వెళ్తే ఉపాధి కోల్పోతానని మెయిడ్‌ అందుకు నిరాకరించిందని చెప్పారు. మెయిడ్‌ స్టేషన్‌కు హాజరుకాకుండా ఫిర్యాదును తీసుకోలేమని పోలీసులకు చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు వివరించారు.

    సెలబ్రిటీ 4:

    సెలబ్రిటీ 4:

    ఈ సెలబ్రిటీ మెయిడ్‌ వెళ్లిపోయినందుకు కంపెనీపై కేసు వేస్తానని బెదిరించారని తెలిపారు. శారీరకంగా, మానసికంగా మెయిడ్‌ను వేధించడంతో ఆమె వెళ్లిపోయిందని చెప్పారు. ఇలా మెయిడ్ ని వేదించి వెళ్ళిపోయేలా చేసిందే కాక ఆమెకు చెల్లించాల్సిన ఫీజు ని కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారట

    సెలబ్రిటీ 5:

    సెలబ్రిటీ 5:

    బుక్‌ మై బాయ్‌కు ఇవ్వాల్సిన రూ.15 వేల సర్వీస్‌ చార్జీని ఈ సెలబ్రిటీ ఇవ్వలేదని ఆరోపించారు. పేమెంట్‌ కోసం కంపెనీ ప్రతినిధులు కాల్ చేయడంతో ఆమె(సెలబ్రిటీ) కాల్స్‌ లిఫ్ట్‌ చేయడం మానేశారని చెప్పారు. కొద్దిరోజుల తర్వాత తాను డబ్బులు కట్టనని ఏం చేసుకుంటారో చేసుకోమని అన్నారని తెలిపారు.

    English summary
    BookMyBai.com Has Banned Bollywood Celebs From Availing Its Services After Multiple Cases Of Misconduct
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X