»   »  పుస్తకరూపంలో సూపర్ స్టార్ సినిమా

పుస్తకరూపంలో సూపర్ స్టార్ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Book on 'Alluri Seetharama Raju' movie
హైదరాబాద్: సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్లో అతి ముఖ్యమైన సినిమా 'అల్లూరి సీతారామరాజు'. ఈ చిత్రం విడుదలై 40సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారంతో విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు పేరుతో ఓ పుస్తకాన్ని విడుదలచేయబోతున్నారు. సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రాసిన ఈ పుస్తకంలో సీతారామరాజు చరిత్రకు సంబంధించిన అనేక విషయాల్ని పొందుపరిచారు. మే 31న తన పుట్టినరోజు సందర్భంగా కష్ణ ఈ పుస్తకాన్ని ఊటీలో ఆవిష్కరించబోతున్నారు.

మన్యం వీరుడుగా గుర్తింపు పొంది. బ్రిటిష్‌ పాలన అంతం చేయడానికి సాయుధ పోరాటం చేసి, ప్రతీ గుండెల్లో చైతన్యం రగిలించిన, స్ఫూర్తినిచ్చిన అల్లూరి సీతారామరాజు చరిత్రను సినిమాగా తీయాలని చాలామంది ప్రయత్నించినా సాహసిగా గుర్తింపుపొందిన కృష్ణకే అది సాధ్యమైంది.

తెలుగువారి గుండెల్లోనే కాదు స్వతంత్రేచ్ఛ వున్న ప్రతి భారతీయుడిలోనూ అల్లూరి సీతారామరాజు చిత్రం అందులోని పాటలు, మాటలు, పాత్రలు ఎప్పటికీ ఒక తీపి గుర్తే. షూటింగ్‌ వాహినీ స్టూడియోలో 12.12.73న ప్రారంభమైన తరువాత విశాఖపట్టణం సమీపంలోగల చింతపల్లి, లంబసింగి, లోతుగడ్డ, పాశంపాడు, అన్నవరం, కృష్ణదేవిపేట, బలిమెల పరిసరాల్లో చిత్రీకరణ పూర్తిచేశారు. చాలాభాగం చిత్రీకరణ జరిగాక దర్శ కుడు వి.రామచంద్రరావు హఠాత్తుగా మరణించడంతో కొంతభాగం కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ దర్శకత్వంలో రూపొందింది.

భారతదేశంలో సినిమా స్కోప్‌లో తీసిన మూడవ చిత్రం ఇది. ఛాయాగ్రహకుడు వి.ఎస్‌.ఆర్‌. స్వామి పట్టుదలతోనే కమల్‌ అమ్రోహి నుంచి సినిమా స్కోప్‌ లెన్సులు అద్దెకుతెచ్చి మరీ చిత్రాన్ని రూపొందించిన వి.ఎస్‌.ఆర్‌.స్వామి సాంకేతికంగా ఎక్కువ అభివృద్ధి చెందకపోయినా ఎన్నో అగచాట్లు పడి, మరీ అద్భుతంగా చిత్రీకరణ జరిపారు.

అల్లూరి సీతారామరాజుగా కృష్ణ, రూదర్‌ఫర్డ్‌గా జగ్గయ్య, గంటం దొరగా గుమ్మడి, మల్లుదొరగా ప్రభాకరరెడ్డి, అగ్గిరాజుగా బాలయ్య, పడాలుగా కాంతారావు, వీరయ్య దొరగా రావుగోపాలరావు, గోవిందుగా చంద్రమోహన్‌, శరభన్నగా ఆర్జా జనార్దనరావు, ఎర్రోసుగా పి.జె.శర్మ, కోయ రాముడుగా కొమ్మినేని శేషగిరిరావు, సింగన్నగా అల్లు రామలింగయ్య, బ్రేకన్‌గా పేకేటి శివరాం, మేజర్‌ గూడల్‌గా రాజనాల, బాస్టియన్‌గా త్యాగరాజు, పిళ్లైగా కె.వి.చలం. కోవర్టుగా కె.జగ్గారావు, హైదర్‌గా ఆనందమోహన్‌, సీత పాత్రలో విజయనిర్మల, రత్తిగా మంజుల, గంగమ్మగా జయంతి, సింగిగా రాజశ్రీ, నారాయణమ్మగా పండరీబాయి, ఇన్‌స్పెక్టర్లుగా రాజబాబు, జగ్గారావు నటించారు. మోహన్‌బాబు, రామ్మోహన్‌, మిక్కిలినేని, శ్రీధర్‌, సాక్షిరంగారావు, ఉదయలక్ష్మి, నందితాదాస్‌, జగదీష్‌ అనేకమంది జూనియర్‌ ఆర్టిస్టులు మిగతా పాత్రలు పోషించారు.ఆదినారాయణరావు సంగీత సారథ్యంలో శ్రీశ్రీ రాసిన 'తెలుగు వీర లేవరా..., సినారె రాసిన 'వస్తాడు నారాజు...' ఆరుద్ర రాసిన 'కొండదేవతా నిన్ను కొలిచేమమ్మా...' 'రగిలింది విప్లవాగ్ని...' 'విప్లవం మరణించదు...' పాటలు, ఆది నారాయణరావు రాసిన 'హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్‌...' కొసరాజు రాసిన 'హైలెస్సో... జంబాయిలే జోరు...' పాటలు సినిమాకు హైలైట్స్‌.

English summary

 Super Star Krishna’s super hit classical movie “Alluri Seetharama Raju” completes 40 years. The film was released on May 1st, 1974.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu