»   »  ముమైత్ పై మందుబాబుల వీరంగం

ముమైత్ పై మందుబాబుల వీరంగం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mumaith Khan
ముమైత్ ఖాన్ అంటే మాటలా...నవ్వులాట మాత్రం అసలు కాదు. ఎంత ఐటమ్ గాళ్ అయినా మీద మందు పోస్తే ఊరుకుంటుందా....ఊరుకోలేదు...ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడినుంచి వెళ్లిపోయింది. వివరాలలోకి వస్తే...2007 సంవత్సరానికి గుడ్ బాయ్ చెప్పడానికి హైదరాబాద్ నగరంలో ఉన్న సుప్రభాత్ హోటల్ వాళ్లు గెస్ట్ గా ముమైత్ ఖాన్ ఆహ్వానించారు. ఆమె కూడా నో చెప్పకుండా ఒప్పుకుంది...ఇంతవరకు బాగానే ఉంది కానీ...సుప్రభాత్ హోటల్ వాళ్లే అతి చేశారు...పట్టుమని 50 మంది కూడా పట్టని తమ హోటల్ మీటింగ్ హాల్ లోముమైత్ ఖాన్ కార్యక్రమం పెట్టారు. తమ హోటల్లో ముమైత్ ఖాన్ కార్యక్రమం ఉందహో అంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం వాళ్లు టికెట్లు అమ్మినట్టు భారీగా అంచనాకు మించి టికెట్లు అమ్మారు..అంటే వందల టికెట్లు అన్నమాట. మాట ఇచ్చిన ముమైత్ కు ఇవేమీ తెలియవు పాపం. కార్యక్రమానికి వచ్చేసింది. హోటల్ లో ఉన్న కిక్కిరిసిన జనాన్ని చూసి కూడా ముమైత్ పెద్దగా భయపడలేదు...హాల్లోకి వెళ్లింది..మనవాళ్లు మందుకొట్టి అప్పటికే కిక్కెక్కి ఉన్నారు. ముమైత్ ఖాన్ ను చూడగానే వెర్రెక్కి ఆమె మీద మందు పోశారు. గందరగోళం సృష్టించారు. ఎంత ఐటమ్ గాళ్ అయినా ఊరుకుంటారా..ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడినుంచి వెళ్లిపోయింది...కార్యక్రమం చూడ్డానికి వచ్చిన మందుబాబులు ప్రోగ్రామ్ మొదలు కాకముందే ముమైత్ వెళ్లిపోతుందా అంటూ వారూ అంతే ఆగ్రహంతో ఊగిపోతూ హోటల్లో చిందులు వేశారు. విధ్వంసానికి దిగారు..విషయం తెలిసిన పోలీసులు ఊరుకుంటారా..దగ్గరే కాబట్టి వేగంగా వచ్చి మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X