twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికాజ్....! బాస్ ఇజ్ బాస్...!! బాస్ ఈజ్ బ్యాక్ ...!!!

    చిరంజీవి ఇంతకన్నా మంచి కమ్ బ్యాక్ సినిమా ఉండబోదు అన్న రీతిలో తెరపై విజృంభించారు. ఆయన ఈ సినిమాపై పెట్టిన శ్రద్ద అడుగడుగునా కనిపిస్తుంది.

    |

    టాలీవుడ్లో టాప్-1 టు 10 ప్లేసెస్ మెగాస్టార్ చిరంజీవివే అన్నారు దాసరి నారాయణరావు ఒకప్పుడు. ఒక స్టార్ ఇమేజ్ సంపాదించాక మహేష్ బాబు ఓ సందర్భంలో నెంబర్ వన్ అంటే చిరంజీవే అని.. ఆయన్ని రేప్లేస్ చేయడం అన్నది ఎప్పటికీ జరగదని అన్నారు. సామాన్య ప్రేక్షకుల అభిప్రాయం కూడా ఇలాగే ఉండేది. ఎన్టీఆర్ శకం ముగిశాక రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమాను మకుటం లేని మహారాజులా ఏలాడు మెగాస్టార్. ఆయన స్థానానికి ఎప్పుడూ ఢోకా లేకపోయింది.

    అయితే అనూహ్యమంగా సినిమాకి స్వస్తి పలి రాజకీయాల్లోకి వెళ్ళిన చిరంజీవి తొమ్మిదేళ్ళ సుధీర్ఘ విరామం తీసుకున్నారు. ఈ దాదాపు దశాబ్ద కాలం లో తెలుగు సినిమా చాలా మార్పులకు లోనయ్యింది. సినిమా నడత మారింది. నెంబర్ రేసు కూడా మారింది. ప్రస్తుతం నెంబర్ వన్ రేసు ప్రధానంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల మధ్య సాగుతోంది. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు కూడా గట్టి పోటీదారులుగా ఉన్నారు.

    Boss is Back to Treat Fans

    ఇప్పుడు చిరు పునరాగమనం చేయగానే ఆయనకు అగ్ర స్థానం ఇచ్చేయాలంటే కష్టం. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మిగతా హీరోలతోనే చిరు పోటీ పడాల్సి ఉంది తప్ప.. చిరుతో మిగతా హీరోలు పోటీ పడే పరిస్థితి లేదు. అసలిప్పుడు బాక్సాఫీస్ రికార్డుల లెక్కలన్నీ మారిపోయాయి. 100 డేస్ సెంటర్లు పోయి.. కలెక్షన్ల ఆధారంగా సినిమా స్థాయిని నిర్ణయిస్తున్నారు.

    మరి ఈ సంధర్భం లో వస్తున్న చిరంజీవి ఎలాంటి అనుభవాన్ని ఎర్దుర్కోబోతున్నాడు? నిన్నటి వరకూ అందరికీ ఇదే ప్రశ్న అయితే రాత్రినుంచే ఈ ప్రశ్న అసలు అర్థం లేనిదని తేలిపోయింది.... బికాజ్.... బాస్ ఇజ్ బాస్... బాస్ ఈజ్ బ్యాక్ అనే అరుపులూ, కేరింతలూ పదేళ్ళ తర్వాత అన్నయ్యని స్క్రీన్ మీద చూసుకున్న ఆనందం.... ఎట్టకేలకు మెగస్టార్ ముందు కాలం, మార్పులూ, కొత్త పోకడలూ, జనరేషన్ గ్యాప్ లూ ఏవీ పనికి రావని తేలిపోయాయ్.....

    సినిమా సూపర్ హిట్ అని తేలిపోయింది నటుడు శ్రీకాంత్, దర్శకుడు మారుతీ, మిగతా హీరోలూ... అన్నయ్యని చూసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటప్పుడు కూడా కేవలం చిరంజీవి ఫ్యాన్స్ గా కనిపించారు. చిరంజీవి ఇంతకన్నా మంచి కమ్ బ్యాక్ సినిమా ఉండబోదు అన్న రీతిలో తెరపై విజృంభించారు. ఆయన ఈ సినిమాపై పెట్టిన శ్రద్ద అడుగడుగునా కనిపిస్తుంది.

    ముఖ్యంగా సోషల్ మెసేజ్ తో కూడిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వినాయిక్ ఈ సినిమా ని రూపొందించారు. ఒరిజనల్ తమిళ సినిమా కత్తిలో ఉన్న కీలక అంశాలను మిస్ అవ్వకుండా... వాటిని నేటివిటి అద్దుకుంటూ..మెగాభిమానులు మెచ్చుకునేలా..మరింత కామెడీని, మసాలాని అద్దే ప్రయత్నం చేసారు. మొత్తానికి పదేళ్ళు వేచి ఉన్నందుకు అభిమానులకు ఏం కావాలో అది దొరికింది...

    English summary
    Chiranjeevi is coming on the big screens with a bang almost after 10 years with ‘Khaidi No 150‘ to rule the box office on January 11th worldwide. It is directed by V. V. Vinayak and produced by Ram Charan along with his mother Surekha Konidela under Konidela Productions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X