»   » నందమూరి వర్సెస్ అక్కినేని.. పోటాపోటీగా.. నువ్వా నేనా?

నందమూరి వర్సెస్ అక్కినేని.. పోటాపోటీగా.. నువ్వా నేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అగ్రహీరోలు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం తరచుగా జరుగుతుంటాయి. కొన్ని పరిస్థితుల కారణంగా తప్పనిసరిగా రిలీజ్ క్లాష్ జరుగుతుంటాయి. టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఇలాంటి పరిస్థితి ఎదురైనా నిర్మాతల మధ్య అవగాహనతో పోటాపోటీ రిలీజ్ ఆగిపోయింది. ఈ ముప్పు ఇలా తప్పించుకోగానే .. నాగార్జున, నందమూరి కల్యాణ్‌రామ్ మధ్య మరో పోటాపోటీ రిలీజ్‌ టాలీవుడ్‌లో అనివార్యమైనట్టు కనిపిస్తున్నది.

 నా నువ్వే కల్యాణ్‌రామ్

నా నువ్వే కల్యాణ్‌రామ్

నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా భాటియా నటిస్తున్న నా నువ్వే చిత్రం పూర్తి కావొచ్చింది. ఈ చిత్రానికి యాడ్ ఫిలిం డైరెక్టర్ జయేంద్ర పంచపకేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. శరత్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

 ఆఫీసర్‌గా నాగార్జున అక్కినేని

ఆఫీసర్‌గా నాగార్జున అక్కినేని

సంచలన విజయం సాధించిన శివ తర్వాత నాగార్జున అక్కినేని, రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఆఫీసర్. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. శివ చిత్రానికి ధీటుగా ఈ సినిమాకు వర్మ మెరుగులు దిద్దుతున్నారు.

ఎవరు ముందు ? ఇదీ డీల్..!
మే 25న పోటాపోటీగా రిలీజ్

మే 25న పోటాపోటీగా రిలీజ్

అయితే నందమూరి వారసుడు కల్యాణ్‌రాం చిత్రం నా నువ్వే, అక్కినేని వారసుడు నాగార్జున చిత్రం ఆఫీసర్ చిత్రాలు ఒకే రోజున రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాలను మే 25న విడుదల చేయనున్నట్టు ప్రకటన వెలువడింది.

 రాజీపడిన మహేష్, అల్లు అర్జున్

రాజీపడిన మహేష్, అల్లు అర్జున్

గతంలో ఏప్రిల్ మూడోవారంలో ఒకే రోజున అంటే ఏప్రిల్ 27న ప్రిన్స్ మహేష్‌బాబు భరత్ అను నేను, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రాలు పోటాపోటీగా రిలీజ్ చేయాలని ప్రకటన చేశారు. అయితే నిర్మాతల మధ్య జరిగిన చర్చల వలన ఏప్రిల్ 20న భరత్ అను నేను, మే 4న నా పేరు సూర్య సినిమాలను రిలీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

English summary
Box office clash between Nandamuri Kalyan Ram versus Nagarjuna unaviodable. The latest development is that the makers have announced that they will release the film on May 25. Directed by Jayendra Panchapakesan, Naa Nuvve has music by Sharreth. Ram Gopal Varma recently released the motion poster of his film with Nagarjuna and revealed the title of the film as Officer. The makers also announced the release date as May 25. It is going to be a tough fight between the two films since they both have a talented cast and crew onboard.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu