»   » ‘సరైనోడు’ స్టోరీలైన్, రీషూట్స్ నిజమే, అందుకే బాలయ్య కు...ఇంకా : బోయపాటి శ్రీను (ఇంటర్వూ)

‘సరైనోడు’ స్టోరీలైన్, రీషూట్స్ నిజమే, అందుకే బాలయ్య కు...ఇంకా : బోయపాటి శ్రీను (ఇంటర్వూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యాక్షన్ కు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచే దర్శకుడు ఎవరూ తెలుగులో అంటే బోయపాటి శ్రీనివాస్ అని కళ్లు మూసుకుని చెప్పవచ్చు. ప్రేక్షకులు మెచ్చే కమర్షియల్ చిత్రాలకు ఆయన పెట్టింది పేరు.

రవితేజతో చేసిన తొలి చిత్రం 'భద్ర' నుంచి బాలయ్యతో చేసిన 'లెజెండ్‌' వరకూ ఆయన చిత్రాల్లో హీరోలు ఎప్పుడూ యాక్షన్ లెక్కలు చూసుకుంటూనే ఉన్నారు. దాంతో అప్పడప్పుడూ...దమ్ము తగ్గినా... ఎప్పుడూ భాక్సాఫీస్ లెక్క తప్పలేదు. అదే ధీమాతో ఇప్పుడు అల్లు అర్జున్‌ని 'సరైనోడు'గా మార్చేశారు. ఈరోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మీడియాతో ముచ్చటించారు.

'సరైనోడు' ఆడియన మార్క్‌ మూవీ. నా మార్కూ, బన్నీ మార్కూ ఉంటాయి. అన్నిటినీ మించి హ్యూమన్ ఎమోషన్ ప్రధానంగా సాగుతుంది. సకుటుంబంగా చూడదగిన చిత్రం. ఆడియన ఏం చూడాలనుకుని థియేటర్‌కి వస్తాడో అన్నీ ఉంటాయి. ఇంతకు ముందు నేను చేసిన సినిమాలు వేరు. ఇప్పుడు ఎనర్జీ ఉన్న వేరే లెవల్‌ హీరో దొరికాడు. అతని యాస్పెక్ట్‌లో వెళ్లా. ప్రేక్షకులకు ఫుల్‌ మీల్స్‌ వడ్డించాలనే ఈ సినిమా తీశా అంటున్నారు బోయపాటి.

స్లైడ్ షోలో ఆయన ఇంటర్వూలో ముఖ్యాంశాలు

‘సరైనోడు' పాయింట్

‘సరైనోడు' పాయింట్

మన కళ్లముందు ఓ దుర్మార్గుడు అక్రమంగా ఎదుగుతుంటాడు. వాణ్ని కొట్టే దమ్మున్న మొనగాడొకడొస్తే, ‘ఇన్నాళ్లకు సరైనోడు వచ్చాడ్రా' అనుకొంటాం. ఆ సరైనోడే నా హీరో. ధర్మం నాలుగు కాళ్లమీద నడవాలి, అధర్మానికి అసలు కాళ్లే ఉండకూడదు అని నమ్మే ఓ వ్యక్తి కథ. ఇందులో మిలిటరీ భాగం కూడా కొంత ఉంటుంది.

నాలుగేళ్ల క్రితమె చెప్పా..

నాలుగేళ్ల క్రితమె చెప్పా..

బన్నీకి ఈ కథను నాలుగున్నరేళ్ల ముందు చెప్పా. అప్పటి నుంచి ఇద్దరం ఏదో ఒక ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాం. ఇన్నాళ్లకి ఇద్దరికీ కుదిరింది.

బన్ని అడిగాడు...

బన్ని అడిగాడు...

‘నన్ను కొత్తగా చూపించండి' అని బన్నీ అన్నాడు. దాంతో మేం ఆయన లుక్స్‌ మీద కృషి చేశాం. తల వెంట్రుక నుంచి వ్యావహారిక శైలి, డిక్షన, మాడ్యులేషన ప్రతి విషయంలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

తీరేలా..

తీరేలా..

ఆయన నాతో సినిమా చేయాలని ఎంత ఎగ్జయిట్‌మెంట్‌తో ఉండేవాడో, ఆ ఉత్సాహమంతా ఈ సినిమాతో తీరేలా పాత్రను తీర్చిదిద్దాను.

చిరు ఎగ్జైట్ మెంట్

చిరు ఎగ్జైట్ మెంట్

చిరంజీవిగారు సినిమా చూసి ఎగ్జయిట్‌ అయ్యారు. ఆయన వ్యక్తం చేసిన ఆనందాన్ని నేను ఎన్ని మాటల్లో చెప్పినా తక్కువే అవుతుంది.

ఎమోషన్ ని వదలలేదు

ఎమోషన్ ని వదలలేదు

‘వూర మాస్‌..'ఉంటుంది. కానీ దానికీ ఓ స్టైల్‌ ఉంటుంది. హీరోయిజాన్ని ఏ స్థాయిలో చూపించినా, నా కథల్లో కుటుంబ బంధాలకూ చోటుంటుంది. ఇప్పటికీ భావోద్వేగాల్ని తట్టే సినిమా ఉంటే ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకొంటున్నారు. అమ్మా, నాన్న, అన్న, తమ్ముడు... ఈ ఎమోషన్స్‌ను వదిలేసిన ఏ కథ నిలబడదు. అవన్నీ నా సినిమాలో ఉంటాయి.

ఎవరి సినిమా

ఎవరి సినిమా


ఇంతకీ ఇది బన్నీ సినిమానా, బోయపాటి సినిమానా? అంటే ప్రేక్షకుడి సినిమా. నేను ఏ హీరోతో సినిమా చేసినా ఒక్కటే ఆలోచిస్తా. ‘ఇది వరకు టచ్‌ చేయని కథ చెప్పాలి. ఇది వరకు ఈ హీరోని ఎవ్వరూ చూపించని కోణంలో ఆవిష్కరించాలి' అనుకొంటా. అలాంటి కథ దొరికితేనే సినిమా చేస్తా. ఒక్కమాటలో చెప్పాలంటే బన్నీ నూటికి నూరుశాతం కొత్తగా కనిపిస్తాడు. దాంతో పాటు నా శైలీ ఉంటుంది.

రీషూట్లు చేశారని, రీ సెన్సార్‌

రీషూట్లు చేశారని, రీ సెన్సార్‌

సెన్సార్‌ వాళ్లు ‘ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చారండీ. మేం ‘యు బై ఎ' కోరుకొన్నాం. అలా రావాలంటే కొన్ని సన్నివేశాల్ని తీసేయమన్నారు. కానీ ఆ సన్నివేశాల్ని తీసేస్తే కథ దెబ్బతింటుంది. అందుకే అవే సన్నివేశాల్ని కాస్త డోసు తగ్గించి మళ్లీ తీశాం.

సింహ తక్కువే అయినా...

సింహ తక్కువే అయినా...తెరపై మనం చూపిస్తున్న ఎమోషన్‌ని ప్రేక్షకుడు ఆస్వాదిస్తున్నాడా, లేదా? అన్నదే ముఖ్యం. నిజానికి నా సినిమాల్లో హింస తక్కువే. ‘సింహా', ‘లెజెండ్‌'లో హింస ఎక్కడుంది? కానీ అలా పేరొచ్చేసిందంతే.

అందుకే బాలయ్యకు నో

అందుకే బాలయ్యకు నో

బాలకృష్ణ 100వ చిత్రం ఎందుకు వదులుకొన్నానంటే... నా చేతిలో ‘సరైనోడు' ఉంది కదండీ. ఈ సినిమా అయ్యాక మళ్లీ బాలయ్యబాబు కథపై కూర్చోవాలంటే నాకు నాలుగు నెలలైనా పడుతుంది. నేనెప్పుడూ చకచక సినిమాలు తీసేయలేను. అందుకే నా నుంచి ఇప్పటి వరకూ చాలా తక్కువ సినిమాలొచ్చాయి. పైగా ‘సింహా', ‘లెజెండ్‌' తరవాత బాలయ్య బాబుతో సినిమా అంటే.. అభిమానులు ఎక్కడో ఆశిస్తారు. ఆ అంచనాలు అందుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. బాలయ్యబాబుతో ఆలస్యమైనా మంచి సినిమా ఇవ్వాలి.

సంఖ్య కీలకం కాదు..

సంఖ్య కీలకం కాదు..

నాకు సంఖ్య ఎప్పుడూ కీలకం కాదు. నేను చేసుకునే స్ర్కిప్ట్‌ నాకు నచ్చాలి. ఆ తర్వాతే ఏదైనా. ఈ తత్వం లేకపోయి ఉంటే ఇప్పటికీ చాలా సినిమాలే చేసి సెటిలైపోయేవాడిని. క్వాంటిటీని పట్టించుకోను. క్వాలిటీకి ప్రాధాన్యమిస్తాను.

ఎవరు అన్నారు

ఎవరు అన్నారు

నా సినిమాల్లో యాక్షన్ ‘ఒక స్కేలుకు పైనే ఉంటుంద'ని అంటుంటారు. అసలు ఆ స్కేల్‌ ఎవరు గీశారు? ఒకవేళ అదే నిజమైతే ‘భద్ర', ‘తులసి', ‘దమ్ము', ‘సింహా', ‘లెజెండ్‌' వంటి సినిమాలను ప్రేక్షకులు ఎందుకు ఆదరించారు?

ఎమోషన్ కి తగ్గట్లే..

ఎమోషన్ కి తగ్గట్లే..

నా సినిమాల్లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషనకు ఆ హీట్‌ సరిపోతుంది. ఇలాంటి సినిమాలు ఇంకో పది చేస్తానేమో. ఇంత ఎమోషనతో అంతకు మించి చేయగలనో లేదో చూడాలి. అన్నీ కథలైతే లైన్ల రూపంలో ఉన్నాయి. సంఖ్యతో ప్రమేయం లేకుండా ఎప్పుడు సినిమా చేసినా క్వాలిటీగా, ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ నచ్చేలా తీయాలన్నదే నా సంకల్పం.

పులి మీద స్వారీనే

పులి మీద స్వారీనే


కమర్షియల్‌ సినిమా అంటే పులిమీద స్వారీనే. ఎక్కామా, అలా స్వారీ చేస్తూనే ఉండాలి. దిగితే, పులే మింగేస్తుంది. బోయపాటి సినిమా ఇలా ఉంటుందని ప్రేక్షకుడు, నా సినిమా కొనే బయ్యర్‌... ఫిక్సయిపోయి ఉంటారు. ఆ నమ్మకాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత నాపై ఉంది.

అరవింద్ గారు..

అరవింద్ గారు..

మనలో క్లారిటీ ఉంటే అరవింద్‌గారు ఏమీ అడగరు. మనమే తికమకపడుతుంటేనే ఆయన ఆరా తీస్తారు. నేను నా స్క్రిప్ట్‌ విషయంలో 200 శాతం క్లారిటీగా ఉండేవాణ్ణి. అందుకేనేమో మా సెట్‌కు మొత్తం మీద ఆరేడుసార్లు వచ్చారాయన.

ఆదిని ఆయనే అడిగారు

ఆదిని ఆయనే అడిగారు

‘ఆది పినిశెట్టి విలనగా చేస్తాడా? నా ఫ్రెండ్‌ కొడుకు. ఎలా అడగాలి' అని ప్రారంభంలో అరవింద్‌గారు నాతో అన్నారు. ‘మీరు ఒక్కమాట అడగండి. కథ వింటానంటే ఓకే. లేకుంటే మీరు ఎవరితో చేయమన్నా చేస్తాను' అని చెప్పా. వెంటనే ఆయన ఫోన చేశారు. ఆది కథ వింటానని అన్నాడట. 20 నిమిషాలు కథ విని ‘చేస్తాను అంకుల్‌' అని అరవింద్‌గారితో అన్నాడు. ఇందులో ఆది స్టైలిష్‌ విలనగా కనిపిస్తాడు.

చేతులు దులుపుకోను

చేతులు దులుపుకోను

మామూలుగా నేను అనుకున్న కథకు కావాల్సిన జవసత్వాలూ సమకూరాకే సెట్స్‌ మీదకు వెళ్తాను. నా కృషి ఎలా ఉంటుందో ఫస్ట్‌లుక్‌లోనే చూపిస్తాను. సినిమాకు అన్నీ సమకూరే వరకు వేచి ఉండాల్సి వస్తే ఉంటానే తప్ప, ఎలా పడితే అలా తీసేసి చేతులు దులుపుకోను.

తదుపరి సినిమా ఎప్పుడు, ఎవరితో?

తదుపరి సినిమా ఎప్పుడు, ఎవరితో?


బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో ఓ సినిమా చేయాలి. త్వరలోనే ఆ వివరాలు చెబుతా.

English summary
Director Boayapati Srinu said that he very much satisfied with Sarinoudu output.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu