»   » జయ జానకి నాయక: సూపర్ టైటిల్ బోయపాటి టేస్ట్ మారిందా?

జయ జానకి నాయక: సూపర్ టైటిల్ బోయపాటి టేస్ట్ మారిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఒక సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించేలా టైటిల్ ఉండాలనే ఉద్దేశంతో బోయపాటి బాగా కసరత్తు చేశాడు. చివరికి ఈ సినిమాకి 'జయ జానకి నాయక' అనే టైటిల్ ను ఖరారు చేస్తూ .. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశాడు.

బోయపాటి గత సినిమాలన్నీ మాస్‌ టైటిల్స్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తొలిసారి 'జయ జానకి నాయక' అంటూ క్లాస్‌ టైటిల్‌ను పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కథానాయకుడి పాత్రను ధీరోదాత్తంగా చూపించడంలో బోయపాటిది ప్రత్యేకశైలి. ఇక 'అల్లుడు శీను', 'స్పీడున్నోడు' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లకొండ శ్రీనివాస్‌తో బోయపాటి చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్ .. దానిని డిజైన్ చేయించిన తీరుకి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'శ్రీరామ రాజ్యం' సినిమాలో "జగదానంద కారక .. జయ జానకి ప్రాణ నాయక .. " అనే సాంగ్ ఎంతో పాప్యులర్ అయింది.

Boyapati's Jaya Janaki Nayaka Title Logo

ఆ పాటలో నుంచి ఈ టైటిల్ ను తీసుకున్నట్టు అర్థమవుతోంది. తన సినిమాలకి పవర్ ఫుల్ టైటిల్స్ పెట్టే బోయపాటి, ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే టైటిల్ పెట్టడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో మరో కథానాయికగా కేథరిన్ నటించిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నఈ చిత్రం టాకీ ఇటీవలే పూర్తయింది. ఇక పాటల చిత్రీకరణ బాకీ వుంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాత.

English summary
Nearly six months after the look, the makers of Boyapati and Bellamkonda have revealed its title - Jaya Janaki Nayaka. And the title did live up to all the hype. It's said that the title has a strong connection to the story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu