»   »  బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna
'భద్ర,తులసి' చిత్రాలతో యాక్షన్,సెంటిమెంటు కలపి హిట్టు కొట్టడంలో సిద్దహస్తుడనిపించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. కాని 'తులసి' తరువాత నాగార్జునతో చేద్దామనుకున్న సినిమా మిస్ ఫైర్ అవ్వటంతో గ్యాప్ వచ్చింది. దాంతో అతను ఈ మధ్య బాలకృష్ణ ని కలసి ఒక హై ఓల్టేజి యాక్షన్ స్టోరి వినిపించాడట. అంతేగాక ఓ ఫొటో సెషన్ కూడా నిర్వహించి తాను బాలయ్యని ఏ రకంగా ప్రెజెంట్ చేయబోతున్నాననేది చూబెట్టి ఇంప్రెస్ చేసాడుట. బాలకృష్ణ ఆ ఫొటో సెషన్ డ్రస్, మేకప్ లోనే పాండురంగడు ఫంక్షన్ కి మొన్న అటెండయ్యారు. దాన్ని బట్టి ఆయనికి బోయపాటి బాగా నచ్చినట్లే అంటున్నారు. ప్రాజెక్టు గ్యారెంటీగా మెటీరిలైజ్ అవుతుందంటున్నారు. అసలు బోయపాటి మొదట తులసి కథని బాలయ్య కోసమే వండాడుట. కాని అనుకోకుండా అన్ని కలిసి రావటంతో వెంకటేష్ తో వర్కవుట్ చేసాడుట. ఇక ఈ కొత్త కాంబినేషన్ తో సినిమా తీసేది జెమిని ఫిల్మ్ సర్క్యూట్ వారట. త్వరలోనే షూటింగ్ వెళ్ళబోయే ఈ చిత్రానికి హీరోయిన్ల ఎంపిక జరుగుతోందిట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X