twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దమ్ము'లో ఎన్టీఆర్ క్యారక్టరైజేషన్ ఏంటి?

    By Srikanya
    |

    'దమ్ము' అంటే కండబలం మాత్రమే కాదు, ఆలోచనల్లో కూడా అంతే దమ్ముండాలి. ఎదుటి వారిని బోల్తా కొట్టించాలంటే మన తెలివికి పదును పెట్టాలి. లక్ష మంది సైన్యం కంటే ఓ తెలివైనవాడే శక్తిమంతుడు. మా హీరో అలాంటోడే..ఇంతకీ అతని లక్ష్యమేమిటి అనేది సస్పెన్స్‌. ఎన్టీఆర్‌ దమ్ముని కొత్త కోణంలో చూపిస్తున్నాం. యాక్షన్‌ ఘట్టాలకే కాదు, వినోదానికీ ప్రాధాన్యం ఉందన్నారు" దర్శకుడు బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'దమ్ము'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో ఆయన చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర గురించి చెప్పుకొచ్చారు.

    "అలాగే, మా హీరో దూకుడు చూసి చిరుత కూడా కుళ్లుకుంటుంది. అతని వేగం చూసి సుడిగాలి కూడా చిన్నబోతుంది. అతన్ని చూసి గడియారం కూడా సమయం సరిదిద్దుకొంటుంది. అతని అడుగుల సవ్వడి విని పిడుగు కూడా బెదిరిపోతుంది. ఇంతకీ ఎవరతను? అతని కథేమిటి అన్నది మా సినిమా చూసి తెలుసుకోండి అంటున్నారు" బోయపాటి శ్రీను.

    ఇక 'దమ్ము' చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తిక నటిస్తున్నారు. తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు. భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది. ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి అలెగ్జాండర్‌ వల్లభ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తున్నారు. సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి.

    English summary
    Director Boyapati Sreenu explained about NTR character in Dammu film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X