Just In
- 4 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 4 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 5 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 6 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- News
Inauguration Day 2021: రేపే బైడెన్, కమల ప్రమాణస్వీకారం -కార్యక్రమ ముఖ్యాంశాలు ఇవే
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలయ్యతో మూడో బ్లాక్‌బస్టర్‌కు బోయపాటి రెడీ.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా..
మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో వినయ విధేయ రామ చిత్రం తర్వాత దర్శకుడు బోయపాటి మరో క్రేజీ ప్రాజెక్టుకు రెడీ అవుతున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణతో హ్యట్రిక్ విజయానికి బోయపాటి సిద్ధమవుతున్నారు. వీరి కలయికలో సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే పట్టాలు ఎక్కబోతున్నది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు..

శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు
బాలకృష్ణతో బోయపాటి రూపొందించబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి బోయపాటి ప్రయత్నాలు చేస్తున్నారు. వినయ విధేయ రామ తర్వాత బోయపాటిపై భారీ అంచనాలు పెరగడంతో పక్కాగా స్క్రిప్టును రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా బాలకృష్ణ ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కథానాయకుడు దెబ్బతో బాలయ్య సంచలన నిర్ణయం.. నష్టాల షాక్ నుంచి తేరుకుని!

బాలయ్య రేంజ్‌కు తగ్గకుండా
క్లాస్ మాస్‌ను మేలవించి తీసిన సింహా బ్లాక్ బస్టర్ విజయంతో బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ మొదలైంది. లెజెండ్ మూవీ కూడా సంచలన విజయం సాధించడంతో ఈ కాంబినేషన్ టాలీవుడ్‌లో క్రేజీగా మారింది. వీరి కాంబినేషన్‌లో ఈ మూడో చిత్రం అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూడో చిత్రంలో బాలయ్యను ఏ రేంజ్‌లో చూపిస్తారనే విషయం అభిమానుల్లో ఉత్కంఠను రేపుతున్నది.

మూడో బ్లాక్‌బస్టర్ కోసం
సింహా రోల్‌ను తలదన్నేలా లెజెండ్ చిత్రంలో బాలకృష్ణ పాత్రను బోయపాటి శ్రీను తీర్చిదిద్దారు. ఇక మూడో సినిమా కోసం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా పాత్రను మలిచినట్టు తెలుస్తున్నది. బాలయ్యతో సినిమా అంటే బోయపాటి పూనకం వచ్చినట్టు తీస్తారనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఇక బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో మరో బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

వినయ, విధేయంగా రూ.95 కోట్లు
రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన వినయ విధేయ రామ చిత్రం సినీ విమర్శకులు పెదవి విరిచినప్పటికీ సాధారణ ప్రేక్షకులు సినిమాను భుజానకెత్తుకున్నారు. ఈ చిత్రంపై నెగిటివ్ టాక్ వినిపించినప్పటికీ రూ.95 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బోయపాటి స్టామినాకు నిదర్శనంగా నిలిచింది.