»   » జోతిష్య పండితుల సూచన: యంగ్ లయన్ మోక్షజ్ఞ అలా..!

జోతిష్య పండితుల సూచన: యంగ్ లయన్ మోక్షజ్ఞ అలా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Boyapati srinu- Mokshagna
హైదరాబాద్: నందమూరి నట సింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ త్వరలో వెండి తెరంగ్రేటం చేయబోతున్నసంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ తెరంగ్రేటం చేయబోయే చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.

బాలయ్యకు సింహా, లెజెండ్ లాంటి భారీ విజయాలు అందించిన బోయపాటి నందమూరి అభిమానులుకు ఫేవరెట్ దర్శకుడు అయ్యాడు. ఫ్యాన్స్ కూడా బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ తెరంగ్రేటం చేయడమే మంచిందని కోరుకుంటున్నారు. జ్యోతిష్య పండితులు కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో బాలయ్య కూడా.....బోయపాటికి తన కొడుకు బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఇటీవల జరిగిన 'లెజెండ్' చిత్రంలో మోక్షజ్ఞతో ఓ పాత్ర చేయించాలని భావించారు. ఈ చిత్రంలో బాలయ్య చిన్నతనంలోని పాత్రను ఆయనతో చేయించాలనుకున్నారు. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ ఇలా కాకుండా....సోలో హీరోగా అయితేనే భవిష్యత్ బాగుంటుందని జ్యోతిష్య పండితులు చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారట.

పరిశ్రమ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైనర్మెంట్స్ వారే నిర్మించనున్నట్లు తెలుస్తోంది. లెజెండ్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సంస్థ.....సినిమా బాక్సాఫీసు వద్ద సాధిస్తున్న ఫలితాలను సంతృప్తి కరంగానే ఉంది.

English summary
The latest buzz is that Boyapati Srinu might be shouldered the responsibility of launching young Nandamuri Lion Mokshagna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu