For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చెవి కోసుకుంటారు: టోటల్ ఇండస్ట్రీని కవర్ చేసిన బోయపాటి, స్పీచ్ అదుర్స్!

  By Bojja Kumar
  |

  బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం జ‌య‌జాన‌కినాయ‌క‌. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైదరాబాద్‌లో జ‌రిగింది.

  ఈ కార్య‌క్ర‌మంలో వి.వి.వినాయ‌క్‌, బోయ‌పాటి శ్రీను, జ‌గ‌ప‌తిబాబు, మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, శ‌ర‌త్‌కుమార్‌, వాణీ విశ్వ‌నాథ్‌, రైట‌ర్ ర‌త్నం, సినిమాటోగ్రాప‌ర్ రిషి పంజాబీ, దేవిశ్రీప్ర‌సాద్‌, సాహిసురేష్‌, ప్రేమ్ ర‌క్షిత్‌, కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, త‌రుణ్ అరోరా త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోయపాటి స్పీచ్ ఆకట్టుకుంది. ఇండస్ట్రీ మొత్తాన్ని కవర్ చేస్తూ బోయపాటి ప్రసంగం ఆకట్టుకుంది.

  నాలుగు అద్భుతాలు జరిగాయి

  నాలుగు అద్భుతాలు జరిగాయి

  బోయపాటి మాట్లాడుతూ.... ``ఈ సంవ‌త్స‌రం తెలుగు ప‌రిశ్రమలో నాలుగు అద్భుతాలు జ‌రిగాయి. మొద‌టిది కళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం, రెండో బాహుబ‌లి 2 విడుదలై భారీ విజయం సాధించి దేశ విదేశాల్లో తెలుగువాళ్లంద‌రూ త‌లెత్తుకునేలా చేయడం, మూడోది ద‌క్షిణ భార‌తదేశ చ‌రిత్రలో ఒకే థియేట‌ర్‌లో 1084 రోజులు ఆడిన సినిమాగా ‘లెజండ్' రికార్డ్ క్రియేట్ చేయడం, నాలుగోది వ‌స్తారా రారా..అని మీమాంస‌లో ఉన్న‌ప్పుడు చిరంజీవిగారు ఖైదీ నంబ‌ర్ 150 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి 150 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుని తెలుగు సినిమా స్టామినాను ప్రూవ్ చేయడం లాంటివి జరిగాయని బోయపాటి అన్నారు.

  Boyapati Srinu Powerful Speech @Jaya Janaki Nayaka Movie Logo Launch | Filmibeat Telugu
  గొప్ప టెక్నీషియన్స్

  గొప్ప టెక్నీషియన్స్

  మ‌న తెలుగు చిత్ర సీమ‌లో టెక్నిషియ‌న్స్ అని మాట్లాడుకోవాలంటే ఓ దాసరిగారు, రాఘ‌వేంద్ర‌రావుగారు, కోదండ‌రామిరెడ్డిగారు, బి.గోపాల్‌, కోడిరామ‌క‌ష్ణ‌గారు, సింగీతం శ్రీనివాస‌రావుగారు ఇలా ఎంతో మంది గొప్ప‌వాళ్లున్నారు. ఆ త‌రానికి వీళ్లు గొప్ప ద‌ర్శ‌కులైతే ఈ త‌రానికి మ‌న‌కు ఓ రాజ‌మౌళి, రామ్‌గోపాల్‌వ‌ర్మ‌, వినాయ‌క్ ఉన్నారు. పూరి, సురేంర‌ద్ రెడ్డి, సుకుమార్‌, తేజ‌, కృష్ణవంశీ వంటి గొప్ప ద‌ర్శ‌కులున్నారు. ఈ త‌రం యంగ్ డైరెక్ట‌ర్స్‌తో పాటు బోయ‌పాటి శ్రీను మీ ముందున్నాడని బోయపాటి అన్నారు.

  చెవి కోసుకుంటారు కాబట్టే

  చెవి కోసుకుంటారు కాబట్టే

  అలాగే తెలుగులో ఎంతో మంది గొప్ప న‌టులున్నారు. ఒక చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌హేష్‌, బ‌న్ని, చ‌ర‌ణ్ వంటి హీరోలున్నారు. యంగ్ హీరోలు నాని, శ‌ర్వానంద్, నిఖిల్ వంటి వారున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో తండ్రి, బాబాయ్‌, అన్న‌య్య వంటి ఏ క్యారెక్ట‌ర్‌నైనా చేయ‌గ‌ల జ‌గ‌ప‌తిబాబు ఉన్నారు. ఇంత మంది గొప్ప‌వాళ్లు మ‌న‌లో ఉండ‌టానికి కార‌ణం తెలుగు ప్రేక్ష‌కులే.... వారు సినిమా అంటే చెవి కోసుకుంటారు కాబట్టే ఇంత మంది గొప్పవారు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు అని బోయపాటి అన్నారు.

  జయ జానకి నాయక

  జయ జానకి నాయక

  జ‌య‌ జానకి నాయ‌క పెట్టడానికి ముందు చాలా తర్జనబర్జనలు పడ్డాం. చివరకు నా అసోసియేట్ మల్లి ఈ పేరు సూచించడంతో బాగా నచ్చేసింది. దాన్నే ఫైనల్ చేశామని బోయపాటి తెలిపారు.

  హీరో క్యారెక్టర్ గురించి

  హీరో క్యారెక్టర్ గురించి

  లైఫ్‌లో క‌ష్టం వ‌చ్చిన ప్ర‌తిసారి ప్రేమ‌ను వ‌దిలేస్తాం. కానీ ఓ యువ‌కుడు నేను ప్రేమించాను కాబ‌ట్టి ప్రేమ‌ను వ‌ద‌ల‌ను. అనే కుర్రాడు క్యారెక్ట‌ర్ ఉంటుంది. నేను నా తండ్రిని, త‌ల్లిని, అన్న‌ను ఎలా ప్రేమించానో, వారు ఎక్క‌డున్నా బావుండాల‌ని కోరుకుంటానో, అలాగే నేను ప్రేమించిన అమ్మాయి బావుండాల‌ని కోరుకుంటాన‌నే క్యారెక్ట‌ర్ హీరోది. ప్ర‌తి ఒక్కరి హృద‌యాల‌ను తాకే సినిమా. ఇలాంటి కుర్రాడు నా కొడుకుగా, ల‌వ‌ర్‌గా, భ‌ర్త‌గా, అన్న‌య్య‌గా ఉండాల‌ని అంద‌రూ అనుకునేలా హీరో క్యారెక్ట‌ర్ ఉంటుంది. అలాంటి క్యారెక్ట‌ర్‌ను సాయి శ్రీనివాస్ అద్భుతంగా చేశాడు అని బోయపాటి అన్నారు.

  మరో ఐదేళ్ల వరకు అలాంటి సీన్ రాదు

  మరో ఐదేళ్ల వరకు అలాంటి సీన్ రాదు

  ‘జయ జానకి నాయక' సినిమాలో హంసల దీవి అని ఎపిసోడ్ చూస్తారు. మళ్లీ ఐదేళ్ల వరకు అలాంటి ఎపిసోడ్ ఏ సినిమాలోనూ చూడలేరు. అంత అద్భుతంగా అంత హై లెవల్ లో ఉంటుంది. ఏ ఎపిసోడ్ చేయాలంటే 690 మంది యూనిట్ సముద్రంలో 11 రోజులు నడుములోతు నీళ్లలో దిగబడి ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా పరిస్థితి వేరేలా ఉంటుంది. అయినా సరే నా మీద నమ్మకంతో నేను తీసుకున్న కేర్ మీద ఉన్న నమ్మకంతో పని చేశారు అని బోయపాటి తెలిపారు.

  బోయపాటి ఫుల్ స్పీచ్

  రిషి పంజాబి, సాహి సురేష్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ టెక్నిషియ‌న్స్‌తో పాటు మంచి న‌టీన‌టులుకు ఈ సినిమాకు కుదిరారు. రకుల్ ప్రీత్ త‌న క్యారెక్ట‌ర్ చ‌క్క‌గాయాప్ట్ అయ్యింది. జ‌గ‌ప‌తిబాబుగారు, శ‌ర‌త్‌కుమార్‌గారు, వాణి విశ్వ‌నాథ్‌, త‌రుణ్ అరోరా స‌హా అంద‌రికీ పేరు పేరునా థాంక్స్‌. నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డిగారు ఖ‌ర్చు విష‌యంలో ఏమాత్రం వెనుకాడ‌లేదని బోయపాటి తెలిపారు.

  English summary
  Jaya Janaki Nayaka Audio Launch held at JRC Convention Hall. Jaya Janaki Nayaka latest 2017 Telugu movie ft. Bellamkonda Sreenivas, Rakul Preet, Pragya Jaiswal, Catherine Tresa, Jagapathi Babu, Dhanya Balakrishna and Ester Noronha. Devi Sri Prasad / DSP composed music for #JJN. Directed by Boyapati Srinu and produced by Miryala Ravinder Reddy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X