»   » తిరుమలలో బోయపాటి....బాలయ్య మూవీకి మొక్కు!

తిరుమలలో బోయపాటి....బాలయ్య మూవీకి మొక్కు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
తిరుమల : సినీ దర్శకుడు బోయపాటి శ్రీను శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 3న బాలయ్యతో కొత్త సినిమాను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ప్రారంభం నేపథ్యంలోనే అంతా శుభం జరుగాలని బోయపాటి శ్రీను ఆ ఏడుకొండల వాడికి మొక్కు చెల్లించి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది.

సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అంటున్నారు బోయపాటి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన చేసే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు.

ఈ చిత్రాన్ని 2014 సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాతికి గతంలో ఎన్నో హిట్స్ బాలకృష్ణకు వచ్చి ఉండటంతో అప్పుడే రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రానికి రకరకాల టైటిల్స్ అనుకుని చివరకు జయసింహ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. జయ సింహ లో సింహ ఉండటం సెంటిమెంట్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మొదట ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఆ టైటిల్ ఇప్పటికే వేరే నిర్మాత రిజిస్టర్ చేసుకోవడంతో పాటు దాన్ని బాలయ్య కోసం ఇవ్వడానికి నిరాకరించాడు. ఈ నేపథ్యంలో 'జయసింహ' టైటిల్ తో ముందుకెళ్తున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

English summary
Director Boyapati Srinu visit Tirumala today. His next movie with Balakrishna, will be launched on 3rd June. The film will be produced by 14 Reels Entertainment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu