»   » బ్రహ్మానందం కౌగిలిలో కాజల్ బందీ.. మొత్తానికి నలిపేశాడట.. ఏం జరిగిందంటే

బ్రహ్మానందం కౌగిలిలో కాజల్ బందీ.. మొత్తానికి నలిపేశాడట.. ఏం జరిగిందంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా షూటింగ్‌లో కామేడి కింగ్ బ్రహ్మనందం ఉంటే అక్కడ నవ్వులు విరబూసినట్టే. షూటింగ్ అంతా సరదా సరదాగా గడిచిపోతుంటదని తోటి నటీనటులు పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. రీల్ లైఫ్‌లోనే కాకుండా.. రియల్ లైఫ్‌లో కూడా హాస్యాన్ని పండిచే బ్రహ్మానందానికి సంబంధించిన ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ ఆసక్తికరమైన సంఘటన ఏమిటంటే..

సెట్స్ ‌పైకి కల్యాణ్ రామ్ ఎంఎల్ఏ

సెట్స్ ‌పైకి కల్యాణ్ రామ్ ఎంఎల్ఏ

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తున్న ఎం.ఎల్‌.ఏ సినిమా ఆదివారం సెట్స్‌పైకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నది. తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కాజల్ తొలిసారి కల్యాణ్ రామ్ సరసన లక్ష్మీ కల్యాణం అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ కాజల్, కల్యాణ్ రామ్ జోడీ కట్టడం గమనార్హం.

పదేళ్ల తర్వాత కల్యాణ్ రామ్‌తో కాజల్

పదేళ్ల తర్వాత కల్యాణ్ రామ్‌తో కాజల్

ఈ సినిమా షూటింగ్‌లో కల్యాణ్, కాజల్, బ్రహ్మానందంపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందంతో కలిసి కల్యాణ్‌రామ్‌ తీసిన సెల్ఫీని హీరోయిన్ కాజల్ సోషల్ మీడయాలో పోస్ట్‌ చేసింది. నా తొలి చిత్ర సహ నటుడు నందమూరి కల్యాణ్‌రామ్‌తో.. కొత్త సినిమా ‘ఎం.ఎల్‌.ఏ.' సెట్స్‌పై మొదటి రోజు.. గతస్మృతులు గుర్తుకు వస్తున్నాయి" అని పేర్కొంది. అయితే ఆ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నది.

కాజల్‌ను కౌగిలిలో బంధించిన బ్రహ్మీ

కాజల్‌ను కౌగిలిలో బంధించిన బ్రహ్మీ

ఇంతకీ ఆ ఫొటోలో ఉన్నదేమిటంటే.. కాజల్ అగర్వాల్‌ను బ్రహ్మానందం తన కౌగిలిలో బంధించాడు. ముద్దు ముద్దుగా ఆమె చుట్టూ చేతులు వేసి గట్టిగా అదుముకున్నాడు. ఆ ఫోటోను కాజల్ తన ఇన్‌‍స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కొత్త దర్శకుడిగా ఉపేంద్ర పరిచయం

కొత్త దర్శకుడిగా ఉపేంద్ర పరిచయం

ఎంఎల్‌ఏ చిత్రానికి ఉపేంద్ర మాధవ్‌ అనే దర్శకుడు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్పీ, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై సీ భరత్‌చౌదరి, ఎంవీ కిరణ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ సమర్పిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

English summary
After 10 years, Hero Kalyan Ram acting with Kajal Agarwal. Now there are pairing in MLA movie which went on sets on Sunday. In this set a funny thing happen between Kajal and Brahmanandam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu