twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా, అరెస్ట్

    By Bojja Kumar
    |

    Mohanbabu
    హైదరాబాద్ : సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు ఇంటి ముందు బ్రహ్మాణులు సోమవారం ధర్నా చేసారు. మంచు విష్ణు హీరోగా రూపొందిన 'దేనికైనా రెడీ' చిత్రంలో బ్రహ్మణులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేసారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

    అంతకు ముందు కొందరు బ్రహ్మణ సంఘాల నేతలు ఫిల్మ్ చాంబర్ కు వెళ్లి వినతిపత్రం సమర్పించారు. చాలా సినిమాల్లో బ్మాహ్మణులను బఫూన్లుగా వాడుకుంటున్నారని, ఇలాంటి ధోరణికి స్వస్తి పలకాలని కోరారు. దేనికైనా రెడీ చిత్రంలో బ్రహ్మణులను మరింత బాధ పెట్టారని, అందరి మంచి కోరే బ్రాహ్మణుడి ఇలా చేయడం వల్ల తమ మనోభావాలు దెబ్బతింటాయన్నారు. రేపటి నుంచి ఆ సీన్లను తొలగించి ప్రదర్శించక పోతే కోర్టు

    గుంటూరులో....

    దేనికైనా రెడీ సినిమాను నిలిపివేయాలని, బ్రాహ్మణులను కించపరిచే సినిమాలను ప్రదర్శిస్తే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. అంతకుముందు బ్రాహ్మణ సంఘాల నాయకుల శంకర్‌విలాస్‌ కూడలి నుంచి ర్యాలీ నిర్వహించారు. అరండల్‌పేట ఓవర్‌ బ్రిడ్జి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. హిందీలో వచ్చిన 'ఉమన్‌ ఇన్‌ బ్రాహ్మనిజం' చిత్రంలో బ్రాహ్మణ మహిళలను కించపరిచేవిగా సన్నివేశాలను చిత్రీకరించారని, ఆ చిత్రాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండు చేశారు.

    ఆందోళనకారులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడినుంచి హరిహర మహల్ థియేటర్ వద్దకు చేరుకొని గేటు ఎదుట బైఠాయించారు. దేనికైనారెడీ సినిమా వాల్‌పోస్టర్లు, హీరో మంచు విష్ణు, మోహన్‌బాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. అరండల్‌పేట ఎస్‌ఐ బ్రాహ్మయ్య అక్కడికి వచ్చి నిరసన విరమించాలని కోరారు.

    English summary
    Brahimns fight againist 'Denikaina Ready'. They demanded the objectionable scenes in the movie, 'Denikaina Ready' to be removed and warned of intensifying agitation and approach court against the film if the scenes were not removed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X