twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను ఎవరినీ తొక్కేయలేదు: బ్రహ్మానందం

    By Srikanya
    |

    హైదరాబాద్ : అలీని హీరో పెట్టుకోమని ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు చెప్పింది నేనే. ఏవీయస్‌ని డెరైక్టర్‌గా రామానాయుడు గారికి రికమండ్ చేసిందీ నేనే. 'ఈగ'లో తాగుబోతు రమేష్‌కి రాజమౌళి వేషం ఇచ్చింది, 'అలా మొదలైంది' సినిమా చూసి కాదు. ఇతను చాలా మంచి ఆర్టిస్టని నేనెప్పుడో చెప్పిన విషయం గుర్తుపెట్టుకొని, రాజమౌళి అందులో అవకాశం ఇచ్చారు అని బ్రహ్మానందం అన్నారు. ఆయన సండే స్పెషల్ ఓ లీడింగ్ డైలీకి ఇచ్చిన ఇంటర్వూులో తన అభిప్రాయాలు వెల్లబుచ్చారు.

    అలాగే రచయితగా స్థిరపడిన ఎమ్మెస్ నారాయణ 'మా నాన్నకు పెళ్లి'తో ఆర్టిస్టు కావడానికి కారణం ఎవరో, ఈవీవీకి ఎవరు రికమండ్ చేశారో ఎమ్మెస్‌ని అడిగితే చెబుతాడు.. ఈ మధ్య 'షాడో'కి, నాకు డేట్లు కుదరకపోవడంతో ఎమ్మెస్‌తో చేయించమని నేనే చెప్పాను'. ఇంతవరకూ నా కెరీర్‌లో ఎవరినీ తొక్కేయలేదు, ఎవరివల్లా ఇన్‌సెక్యూర్‌గా ఫీలవలేదు అని వివరించారు. అలాగే తనకు ఎలాంటి అభద్రతా భావం లేదని చెప్తూ.... అందరితో పాటే నేనూ అనుకుంటాను తప్ప, అంతా నేనే అని ఎప్పుడూ అనుకోలేదు. కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా అన్నారు.

    ఇక ఆ మధ్య ఎమ్మెస్ నారాయణ ఓ మాట అన్నాడు. ''అన్నయ్యా! అందరూ డబ్బు సంపాదించుకుంటారు. స్థలాలు సంపాదించుకుంటారు... నువ్వు బోలెడంత ఈర్ష్య సంపాదించుకున్నావ్'' అని. నిజమే! ఈర్ష్య సంపాదించుకోవడం కూడా ఓ ఇదే! నేను ఎస్‌ఎస్‌ఎల్‌సిలో ఉండగా ఏకపాత్రాభినయం పోటీల్లో చెవిటి సుబ్బయ్య, మొద్దబ్బాయి, మాయల ఫకీరుగా చేసా. దాంతో ఫస్టూ, సెకండూ, థర్డ్ ప్రైజులు నాకే వచ్చాయి. (నవ్వుతూ) అప్పటి నుంచే నామీద ఈర్ష్య మొదలైపోయింది అంటూ చెప్పుకొచ్చారు బ్రహ్మానందం.

    'నాయక్' సినిమాలో 'రంగం' పాటకు వేసిన స్టెప్స్ గురించి చెప్తూ.. డాన్సా.. పాడా! అదంతా దర్శకులు వినాయక్ క్రెడిట్! ఓ పాటకు డాన్సు చేయమని అడిగితే, నేను 'కష్టమేమో' అన్నా! 'జస్ట్... మీరిలా చేస్తే చాలు' అని నృత్యదర్శకుణ్ణి తీసుకొచ్చి మరీ హడావిడి చేశాడు. వినాయక్ అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు, నేనెందుకు కాదనాలి. జస్ట్... అలా మూమెంట్స్ ఇచ్చా అన్నారు.

    English summary
    Brahmannadam happy about his character in Nayak film. He Says that Nayak comedy credit goes to Director VV Vinak only.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X