Don't Miss!
- News
Bengaluru: అపార్ట్ మెంట్ లో ఏం జరిగింది ?, ఆ ఇద్దరూ ఒకే సారి ఎలా చనిపోయారు ?, భార్య ఎంట్రీతో ?
- Sports
INDvsAUS : టెస్టు సిరీస్ తర్వాత.. అశ్విన్ వల్ల వీళ్లకు పీడకలలు తప్పవు!
- Travel
ప్రకృతి రమణీయతకు నిదర్శనం.. హంసలదీవి!
- Technology
ఈ ఆపిల్ మ్యాక్ బుక్ తయారీ నిలిపి వేసిన Apple ! కారణం ఏంటో తెలుసుకోండి!
- Finance
Adani Bonds: అదానీ డాలర్ బాండ్లకు ఎదురుదెబ్బ.. ప్రమోటర్ల తాజా నిర్ణయం ఏమిటంటే..
- Lifestyle
మీ రోజువారీ ఆహారంలో ఈ 9 ఆహారాలు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి...
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఒబామాను వదలని బ్రహ్మీ ఫ్యాన్స్
బ్రహ్మానందంపై అభిమానమో..? లేక ఈయన్ను అడ్డం పెట్టుకుని ఇతరులను వెర్రి వెంగలప్పలను చేయాలనే ఆలోచనో ఏమోగానీ కొంత మంది నెట్ ఆకతాయిలు తెలుగు కామెడీ స్టార్ బ్రహ్మానందం ఫేసుతో ఓ ఆట ఆడుకుంటున్నారు. ప్లాపయిన సినిమాల హీరోలే వీళ్ల టార్గెట్. ఆ మధ్య బద్రీనాథ్ ప్లాపు కావడంతో...అల్లు అర్జున్ ఫోటోకు బ్రహ్మీ ఫేసును మార్ఫింగ్ చేసి 'బ్రహ్మీనాథ్" అనే టైటిల్ తగిలించి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోకి వదిలారు.
మొన్నటికి మొన్న 'దడ" సినిమా ప్లాపయిన నేపథ్యంలో దానికి పేరడీగా 'వడ" అనే టైటిల్ తగిలించారు. ఈ విధంగా పలు ప్లాపు సినిమాలకు బ్రహ్మీ పేరుతో పేరడీ చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ మధ్య రూటు మార్చిన బ్రహ్మీ అభిమానలు....సినిమా రంగం బయటి వ్యక్తుల కూడా వదలడం లేదు. నిన్నటికి నిన్న అన్నా హజారే ఫోటోకు బ్రహ్మానందం ఫోటోను మార్ఫింగ్ చేసి 'బ్రహ్మీ బజారే" అనే టైటిల్ తగిలించి ఫేస్ బుక్ లోకి వదిలారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోటోకు బ్రహ్మీ ఫేసు తగిలించి 'బరాక్ బ్రహ్మం" అంటూ పేరడీ చేశారు. ఈ విధంగా బ్రహ్మీ అభిమాన నెట్ ఆకతాయిలకు ఇంకెంత మంది బలౌతారో...?