నవ్వులడాన్ బ్రహ్మీకి సన్మానం

నాగార్జున కాలేజీ చైర్మన్ బి. సుధాకర్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. బ్రహ్మశ్రీ పత్రీజీ స్వాగతోపన్యాసం అనంతరం ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా మనందరం కొనియాడే హాస్యనటులు బ్రహ్మానందంని సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం పద్మశ్రీ డా. బ్రహ్మానందంని పత్రీజీ పట్టుశాలువా కప్పి సత్కరించగా కాలేజీ చైర్మన్ బి. సుధాకర్ పూలమాల వేసి అభినందించారు. అనంతరం సన్మానపత్రాన్ని చదివి ఆయనకు అందించారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులు అందరూ డా. బ్రహ్మానందంకి పుష్పమాలలు వేసి తమ ఆనందాన్ని ప్రకటించారు. ఈ సందర్భంలో ఆర్పీ పట్నాయక్, కమెడియన్ రాఘవులు బ్రహ్మానందం గురించి ప్రసంగించారు.
అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ...పూర్వాశ్రమంలో నేను లెక్చరర్ ని కాబట్టి నాకు టీచర్స్ డే సందర్భంగా ఈ అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక నన్ను నలుగురి మధ్య ఉన్నప్పుడు ఎవరైనా సరే మాస్టారూ బ్రహ్మానందం అని పిలిస్తే ఆ మాటలో తెలియని పులకింత నాకు కలుగుతుంది. ఎంతో తృప్తిని..సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ముందుగా నా జీవితం అధ్యాపకుడుగా ప్రారంభమై అనంతరం కళాకారుడిగా అయ్యాను. నవ్వించడమనేది అసమాన్యమైన సంగతి. భగవంతుని అనుగ్రహం కలిగిన నాకు నలుగుర్నీ నవ్వించే నటుడిగా అవకాశం కలిగింది. ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నాగార్జున డిగ్రీ కళాశాల వారు టీచర్స్ డే సందర్బంగా నన్ను సత్కరించినందుకు ఎంతో ఆనందంగా ఉంది' అన్నారు.


Click it and Unblock the Notifications











