»   » ఏకంగా... దెయ్యంతో బ్రహ్మీ డాన్స్ లు

ఏకంగా... దెయ్యంతో బ్రహ్మీ డాన్స్ లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బ్రహ్మానందం ఇవాళ తెలుగు సినిమాకు హీరోగా టైటిల్ కార్డు పడని హీరో. ఆయన తమ సినిమాలో నటిస్తే...హిట్ అనే నిర్ణయానికి పెద్ద హీరోలు,నిర్మాణ సంస్ధలు వచ్చి, ఆయన డేట్స్ వేటలో ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో ఆయనపై ఓ దెయ్యం పాటను చిత్రీకరించి వదిలితే ఎలా ఉంటుందనే ఆలోచన కోన వెంకట్ కి వచ్చినట్లుంది. వెంటనే ఆయన తను నిర్మిస్తున్న అంజలి చిత్రం కోసం పాటను షూటింగ్ పెట్టారు. హర్రర్ ఎఫెక్టులో తీసిన ఈ పాటను అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేసారు. ఈ పాటను ప్రమోషన్ సాంగ్ గా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కోన వెంకట్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం గీతాంజలి. అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా రాజ్ కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

 Brahmanandam Goes With Anjali

కోన వెంకట్ మాట్లాడుతూ... 18 ఏళ్ల క్రితం తోకలేనిపిట్ట సినిమాతో నిర్మాతగా మారాను. ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో రోడ్డునపడే పరిస్థితి ఎదురైంది. అయినా ఇండస్ట్రీని వీడలేదు. ఎక్కడపోగొట్టుకున్నది అక్కడే సాధించాలని కషి చేశాను. మా గురువు రామ్‌గోపాల్‌వర్మగారు సత్య సినిమాకు రచయితగా అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి నిలదొక్కుకుని ఇప్పుడు ఈ స్థితికి చేరానుఅన్నారు

అలాగే... ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించాలి. ఆయనకు వేరే కమిట్‌మెంట్స్ వుండటంతో ఈ సినిమా బాధ్యత నామీదపడింది. చాలా కాలంగా సినిమా చేయాలని ఎదురుచూస్తున్న ఎం.వి.వి. సత్యనారాయణకు ఈ చిత్రకథ నచ్చడంతో గీతాంజలి చిత్రాన్ని సైలెంట్‌గా ప్రారంభించాం. అంజలి లేకపోతే ఈ సినిమా లేదు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రహ్మానందం పాత్ర కీలకం. భయంతో నవ్వించే చిత్రమిది. ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందన్న నమ్మకముంది అని నిర్మాత తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ ''ఎవరూ వూహించని కథ కథనాలతో రాబోతున్న చిత్రమిది. హారర్‌, వినోదం కలగలిపి ఉంటాయి. అంజలికి నటిగా మంచి పేరు తీసుకొచ్చే చిత్రమవుతుంది'' అన్నారు. అలాగే ఈ చిత్రంలో అంజలి రెండు పాత్రలను పోషిస్తోందని తెలుస్తోంది. కాలేజీకి వెళ్ళే అమ్మాయిగా, గృహిణిగా ఈ పాత్ర సాగుతుందని చెప్తున్నారు.

ఈ చిత్రంలో హర్షవర్ధన్‌రాణే, బ్రహ్మానందం, రావు రమేష్‌, మధునందన్‌, షకలక శంకర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి కళ: రఘు కులకర్ణి, కూర్పు: ఉపేంద్ర, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.

English summary
Geethanjali promotional song was shot couple of days back in the Aluminum factory with a gothic backdrop and Anjali is touted to be seen as a ghost along with Brahmi and others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu