»   » పాపం బ్రహ్మానందం కు పెద్ద దెబ్బ

పాపం బ్రహ్మానందం కు పెద్ద దెబ్బ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒక టైమ్ లో బ్రహ్మానందం లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మానందం తెరపై కనపడగానే రెస్పాన్స్ వేరుగా ఉండేది. ఇప్పుడు సీన్ మారింది. ఈ 2015 లో ఒక్కటి కూడా సరైన హిట్ కొట్టలేక పోయారు బ్రహ్మనందం. టాలివుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేఈ కమిడియన్ చతికిలపడ్డారు. దానికి కారణం ... రోటిన్ కామెడితో కూడిన ఎక్సప్రెషన్స్. దాంతో బ్రహ్మానందం అటు ప్రేక్షకులను, ఇటు డైరక్టర్లను ఆకట్టుకోలేకపోయారు. ఈ సంవత్సరం ఆయన్ని పెద్ద దెబ్బ కొట్టిందనే చెప్పాలి

ఈ సంవత్సరంలోనే 1000 సినిమాల మార్క్ దాటిన నటుడు, సుమారు 27 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులను బాగా నవ్వించి మెప్పించారు. దాదపు రేసుగుర్రం సినిమాను తన మార్క్ కామెడిలో నిలబెట్టిన ఆ తర్వతా చాలా సినిమాల్లో కనిపించాడు, కాని ఒక్క హిట్ కూడా బ్రహ్మి ఖాతాలో పడలేదు. ఏది ఎమైనా 2015లో బ్రహ్మానందానికి కలిసి రాలేదనే చెప్పాలి.

Brahmanandam highest paid comedian


ఈ మధ్య కాలంలో బ్రహ్మాందం హవా తగ్గింది. స్టార్ హీరోల సినిమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. బ్రహ్మానందం బదులు కొత్త తరం కమెడియన్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. బ్రహ్మానందం కామెడీ తెలుగు సినిమాల్లో డిమాండ్ తగ్గిందని, అందుకే ఆయనతో చేయడానికి స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే వాదన సైతం వినిపిస్తోంది. రెమ్యూనరేషన్ భారీగా ఉండటంతో పాటు... స్క్రిప్టులో వేలు పెట్టడం లాంటివి చేస్తున్నడనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

కొందరు కొత్త దర్శకులైతే బ్రహ్మానందం పని చేయాలంటే చాలా కష్టం అంటూ బెంబేలెత్తిపోయిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఈ పరిణామాలపై ఇప్పటి వరకు సైలెటుంగా ఉన్న ఆయన ఇటీవల తన సన్నిహితులతో ఈ రూమర్లపై స్పందించినట్లు సమాచారం. తాను ఎప్పుడూ కూడా కథ, పాత్రల్లో వేలు పెట్ట లేదని, తన గురించి ఇండస్ట్రీలో ఇలాంటి ప్రచారం జరుగడం తనను విస్మయానికి గురి చేసిందని అన్నట్లు సమాచారం.

తాను కేవలం నటుడిని మాత్రమే. దర్శకులు చెప్పినట్టు నటించడం మాత్రమే తాను చేస్తానని అన్నట్లు తెలుస్తోంది. తనకు ఎక్కువ ప్రయారిటీ ఉండే క్యారెక్టర్స్ క్రియేట్ చేయమని ఎప్పుడూ ఎవరినీ కోరలేదని అన్నారట. కొందరు దర్శకులు, రచయితలతో రిపీటెడ్ గా పని చేసాను. కొన్ని సినిమాలు బాగా ఆడాయి. కొన్ని ఆడలేదు. సినిమా ఆడటం... ఆడక పోవడం కథ, ప్రాత్ర తీరు తెన్నులు, దర్శకత్వం మీదే ఉంటుంది. నేను దర్శకులు చెప్పింది మాత్రమే చేస్తాను. సినిమా ఆడటం ఆడక పోవడం నా చేతుల్లో ఏమీ ఉండదన్నట్లు తెలుస్తోంది.

English summary
There was not a single film or a character of Brahmanandam that was memorable this year.
Please Wait while comments are loading...