twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందానికి బిరుదు ప్రధానం

    By Srikanya
    |

    ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందానికి టీఎస్ఆర్ లలిత కళాపరిషత్ శనివారం 'హాస్యకళా విధాత' బిరుదును ప్రదానం చేసింది. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆడిటోరియం ప్రారంభోత్సవం నగరంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నేపథ్యగాయిని ఎస్.జానకిని కూడా ఘనంగా సత్కరించారు. అతిథులకు, సత్కార గ్రహీతలకు నిర్మాత దగ్గుబాటి రామానాయుడు స్వాగతం పలికారు. అనంతరం సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ... ఎవరిలో కళాత్మక శక్తి ఉంటుందో వారి వదనంలో తేజస్సు ఉంటుందన్నా రు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆడిటోరియాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. పురపాలకశాఖ మంత్రి మహీధరరెడ్డి మాట్లాడుతూ... వెనుకబడిన ప్రాంతాల్లో కూడా నిర్మించాలని సూచించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మాట్లాడుతూ... ఈ మహత్తర ప్రాజెక్టుతో ప్రజల హృదయాల్లో టీఎస్ఆర్ చెరగని స్థానం సంపాదించారని కొనియాడారు. నటుడు మోహన్‌బాబు, సత్కార గ్రహీత బ్రహ్మానందం, డి.రామానాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, తనికెళ్ల భరణి తదితరులు ప్రసంగించారు. ఎస్.జానకి సంగీత విభావరి ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యమంలో కలెక్టర్ లవ్ అగర్వాల్, నగర మేయర్ పులుసు జనార్దనరావు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మళ్ల విజయప్రసాద్, పంచకర్ల రమేష్‌బాబు, నటులు సాయికుమార్, అల్లరి నరేష్, కృష్ణభగవా న్, ఎల్బీ శ్రీరాం, జయలలిత, రాగిణి, ప్రియ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Dr.Brahmanandam is going to felicitate with 'Hasya kala Vidhata' Award by TSR Lalitha Kala Parishat on September 24th in Vishakhapattanam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X