For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పటినుంచి మానేశా.. ఇప్పటికీ 25ఏళ్లు, ఇల్లే లేదు.. ఇక కాంపౌండా?: బ్రహ్మానందం

|
Telugu movies Having Lot of Un Natural Scenes says Telugu Actor

నమ్మిన సిద్దాంతానికి జీవితాంతం కట్టుబడి ఉండేవాళ్లు కొంతమంది ఉంటారు. సినీ ఇండస్ట్రీలో దర్శకుడు నారాయణమూర్తి అందుకు ఓ ఉదాహరణ. పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు కోటి రూపాయలు ఆఫర్ చేసి మరీ తన సినిమాలో ఓ పాత్ర చేయాలని అడిగితే.. నిర్మొహమాటంగా తిరస్కరించారు.

ఎందుకంటే.. ఆయన పంథా వేరు. ఆయన చేయాలనుకున్న సినిమాలు వేరు. ఇక ఎందుకొచ్చిన సిద్దాంతాలు.. వీటిని నమ్ముకుంటే పైసా రాదని భావించేవాళ్లూ ఉంటారు. అందుకే.. అయిష్టంగానైనా డబ్బుల కోసం కొన్ని పనులు కానిచ్చేస్తుంటారు. చూడబోతే బ్రహ్మానందం కూడా దీన్నే ఫాలో అవుతున్నారేమో అనిపిస్తోంది...

25ఏళ్లుగా..:

బ్రహ్మానందం తెర మీద సినిమా చూసి దాదాపు 25ఏళ్లు అయిందట. ఈ మాట ఇంతకు ముందు ఇంటర్వ్యూల్లోనూ చెప్పారు. తాజాగా మరో ఇంటర్వ్యూలోనూ చెప్పారు. బుద్దిజీవులు ఎవరైనా సరే, సహజంగానే తెలుగు సినిమా అసహజత్వాన్ని జీర్ణించుకోవడం కష్టం. బ్రహ్మానందం కూడా ఆ అసహజత్వపు పోకడలను చూసి.. ఎందుకొచ్చిన ఇబ్బంది అని సినిమాలను చూడటమే మానేశారట.

నవ్వు ఆపుకోలేకపోయా..:

చాలా ఏళ్ల క్రితం ఓ సినిమా చూసేందుకని మిత్రులతో కలిసి థియేటర్ కు వెళ్లారట. సినిమాలో ప్రేమలో విఫలమైన భగ్న హీరో.. మందు బాటిల్ పట్టుకుని పాట పాడుతూ.. మధ్య మధ్యలో దగ్గుతున్న సీన్ ఒకటి వస్తోందట. ఆ టైమ్ లో బ్రహ్మానందం పక్క సీట్లో కూర్చొన్న వ్యక్తి ఒకరు.. 'అంత దగ్గు వస్తున్నప్పుడు పాట పాడటమెందుకు?.. డాక్టర్ వద్దకు వెళ్లి మందు వేసుకుని రావచ్చు కదా?' అని కామెంట్ చేశాడట. ఆ దెబ్బకు నవ్వు ఆపుకోలేకపోయారట బ్రహ్మానందం.

అప్పటినుంచి మానేశాను..:

తెలుగు సినిమాను తెర మీద చూస్తుంటే అసహజంగా అనిపిస్తోందని.. మనిషి మాట్లాడితే బ్యాక్ గ్రౌండ్‌లో మ్యూజిక్ రావడమేంటి?.. అందరూ ఒకే రకమైన డ్రెస్సులు వేసుకుని డ్యాన్స్ చేయడమేంటి?.. ఇలాంటి ప్రశ్నలన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఇక సినిమా ఎలా చూడగలను అని చెప్పారు. అందుకే సినిమాలకు వెళ్లడమే మానేశానని అన్నారు.

వీలైతే అక్కడికెళ్లి నాటకాలు చూస్తా..:

సినిమాలు చూడటం మానేశాను గానీ వీలు చిక్కినప్పుడల్లా రవీంద్ర భారతికి వెళ్లి వస్తుంటానని అన్నారు బ్రహ్మానందం. ఎవరి కంటా పడకుండా.. ఒక మూలన కూర్చుని నాటకం చూసేసి వస్తానని, ఇక నాటకం పూర్తవుతుందనుకున్న దశలో పరుగున బయటకొచ్చేస్తానని చెప్పారు.

ఇల్లే లేదు.. ఇక కాంపౌండా?:

ఇక ఇండస్ట్రీలో హీరోల కాంపౌండ్ గొడవలేమైనా మీదాకా వచ్చాయా? అన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు బ్రహ్మి. తనకసలు ఇల్లే లేదని.. ఇక కాంపౌండ్ ఎక్కడిదని బదులిచ్చారు. అందరిని మెప్పిస్తూ.. ఒప్పిస్తూ తిరగడమే తనకు అలవాటు అన్నారు.వుడు సృష్టించిన ఈ నాలుకను అదుపులో పెట్టుకున్నంత కాలం మనకు ఏ చికాకులు మన తలుపుతట్టవు అని చెప్పారు.

ఆచారి అమెరికా యాత్ర:

మంచు విష్ణు, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఆచారి అమెరికా యాత్ర' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఢీ భారీ హిట్ కావడంతో.. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని చాలామంది ఆశిస్తున్నారు.

English summary
In an recent interview comedian Brahmanandam said from last 25years he does't watch any telugu movie because of un natural scenes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more