»   »  గిన్నిస్ బుక్ లో బ్రహ్మానందం!

గిన్నిస్ బుక్ లో బ్రహ్మానందం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రహ్మానందం గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు. కామెడీ కాదండీ నిజంగా సీరియస్సే. గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన విషయాన్ని బ్రహ్మానందమే స్వయంగా చెప్పాడు. బ్రహ్మానందం డ్రామా కంపెనీ చిత్ర విశేషాలను వివరించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనీ విషయం చెప్పాడు. 20 ఏళ్లుగా సినిమా ఫీల్డ్ లో కొనసాగుతున్న తను ఒకే భాషలో 754 చిత్రాలలో నటించి ఈ రికార్డని, ఈ రికార్డును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ అధికారికంగా నిర్ధారిస్తూ ఆయనకు లేఖ పంపినట్టు ఆయన చెప్పారు. అత్తిలిలో 1956 ఫిబ్రవరి 1వ తేదీన జన్మించిన బ్రహ్మానందం తెలుగు అధ్యాపకుడిగా చానాళ్లు జీవితాన్ని సాగించాడు. 1985 ఫిబ్రవరి 1వ తేదీన జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన సత్యాగ్రహం సినిమాతో బ్రహ్మానందం సినిమా కెరీర్ ప్రారంభం అయింది. అహనా పెళ్లంట సినిమాలో అరగుండు బ్రహ్మానందం పాత్రతో అందరినీ ఆకట్టుకున్న బ్రహ్మానందం ఇక వెనుతిరిగి చూసే సమస్యే లేకుండా అప్రతిహాతంగా కెరీర్ ను గిన్నిస్ బుక్ లోకి తరలించాడు. లోఫర్ మామ-సూపర్ అల్లుడు సినిమాతో హీరోగా కూడా ప్రమోషన్ పొందాడు. ఖాన్ దాదా గా ఎదిగాడు. గౌరవ డాక్టరేటు పొందాడు. పలు అవార్డులు రివార్డులు పొందాడు. కుమారుడు గౌతమ్ ను పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా పరిచయం చేశాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X