»   » రేసు గుర్రం: బ్రహ్మానందం పాత్ర ఏమిటంటే?

రేసు గుర్రం: బ్రహ్మానందం పాత్ర ఏమిటంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Brahmanandam role in Race Gurram
హైదరాబాద్: అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రేసు గుర్రం' చిత్రం ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం మరోసారి తన కామెడీతో అలరించనున్నాడు. ఆయన పాత్ర విషయానికొస్తే ఈ చిత్రంలో ఆయన అల్లు అర్జున్ పక్కన ఉండే పోలీసు పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.

సినిమా మొత్తాన్ని పూర్తి వినోదాత్మక చిత్రంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఎంటర్టెన్మెంట్ ఎలిమెంట్స్ అయిన కామెడీ, రొమాన్స్, యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీటవేసాడని తెలుస్తోంది. అల్లు అర్జున్, శృతి హాసన్, సలోని మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయని సమాచారం.

ఇటీవల విడుదలైన 'రేసు గుర్రం' ఆడియోకు మంచి స్పందన వస్తోంది. కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

English summary
According to source, Tollywood comedy don Brahmanandam will be seen in a cop’s role beside Allu Arjun in upcoming movie ‘Race Gurram’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu