»   » అదరగొడుతున్న బ్రహ్మానందం అప్పల్రాజు పాట

అదరగొడుతున్న బ్రహ్మానందం అప్పల్రాజు పాట

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు సినిమాలో ప్రముఖ దర్శకుడు బ్రహ్మానందం స్వయంగా ఓ పాట పాడాడు. ఈ పాటను బ్రహ్మానందం స్వయంగా హైదరాబాదులోని రేడియో మిర్చి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పాట ప్రేక్షకులను అదరగొడుతోంది. నా పేరు శ్రీశైలం అనే ఈ పాట బ్రహ్మానందం గొంతుతో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. కోటి సంగీత దర్శకత్వంలో బ్రహ్మానందం ఈ పాట పాడాడు. ఈ పాట మీద అతనే నటించాడు. ఈ సినిమాలో సునీల్ హీరోగా నటించాడు. కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమపై ఓ సెటైర్ అని చెప్పవచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu