»   » బాలయ్య నిక్‌నేమ్ వెల్లడించిన నారా బ్రాహ్మణి!

బాలయ్య నిక్‌నేమ్ వెల్లడించిన నారా బ్రాహ్మణి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య ఎక్కడ ఉన్నా అక్కడ సందడిగా ఉంటుంది. ఆయన బోళా మనిషి. అందరితో సరదాగా ఉంటారు. ఇక సినిమా ఫంక్షన్లలో అయితే ఆయన కొంటె పనులు, చిలిపి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్య బయట మాత్రమే కాదు...ఇంట్లో కూడా అల్లరి పిల్లాడిలా ఉంటారట.

ఆ సినిమాలో నాతో మోక్షజ్ఞ కూడా నటిస్తున్నాడు: బాలయ్య

ఈ విషయాన్ని చెప్పింది మరెవరో కాదు.... బాలయ్య కూతురు బ్రాహ్మణి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బ్రాహ్మణి ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి, నారా ఫ్యామిలీలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఆమె చెప్పుకొచ్చారు.

అమ్మాయికి ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలి: బాలయ్య షాకింగ్ కామెంట్స్!

Brahmani reveals about Balakrishna nickname

బ్రాహ్మణి కుమారుడు నారా దేవాన్ష్ తో ఆడుకునే సమయంలో బాలయ్య చిన్న పిల్లాడిలా మారిపోతారట. ఇద్దరూ కలిస్తే ఇంట్లో గోల గోలగా ఉంటుందట. అందుకే ఇంట్లో బాలయ్యను అంతా గోల తాతయ్య అని పిలుస్తారట. గతంలో బాలయ్య కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని వెల్లడించారు.

ఇక తన అత్త మామల గురించి బ్రాహ్మణి మాట్లాడుతూ...మామయ్య నారా చంద్రబాబు నాయుడు చాలా జోవియల్ గా ఉంటారు. డబ్బు సంపాదించడం కంటే సోసైటీ గురించి ఆలోచించాలని చెబుతుంటారు. అత్తయ్య భువనేశ్వరి చాలా సపోర్టివ్ గా ఉంటారు. మా పేరెంట్స్ మాదిరిగా ఫ్రీడమ్ ఇస్తారు అని బ్రాహ్మణి చెప్పుకొచ్చింది.

English summary
Brahmani revealed that Balayya becomes a small kid whenever he spends time with her son Nara Devaansh and that's why everyone calls Balayya a 'Gola Tataiah' at home.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu