»   »  వినాయిక్ ఫెరఫెక్ట్ స్కెచ్ వేసాడు

వినాయిక్ ఫెరఫెక్ట్ స్కెచ్ వేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కామెడీ ఉన్న చిత్రాలే ప్రస్తుతం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతన్నాయు. దాంతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు హీరోలూ కామెడీనే నమ్ముకుని రంగంలోకి దిగుతున్నారు. ఇవన్నీ గమనించే తను లాంచ్ చేస్తున్న హీరో సినిమాని కూడా కామెడీతో నింపేసాడు వివి వినాయిక్. ఎందుకంటే సాధారణంగా ఓ హీరో తొలి చిత్రం వస్తోందంటే అంచనాలు బాగుంటాయి. అయితే అది హీరోల వారసులకే పరిమితం. నిర్మాత కుమారుడు హీరో అవుతున్నాడంటే సినిమా విషయం ఉంది అని తెలిస్తేనే థియోటర్ దగ్గర జనాలు ఉంటారు. అందుకే సేఫ్ బెట్ కోసం దర్శకుడు వివి వినాయిక్...కామెడీ తో తన తాజా చిత్రం నింపానని చెప్తున్నారు. దాన్ని చూపుతూనే బ్రహ్మానందంపై ట్రైలర్స్ వదలుతారని తెలుస్తోంది. బ్రహ్మానందం,సమంతని నమ్ముకున్నారని తెలుస్తోంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, సమంత జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. వి.వి.వినాయక్‌ దర్శకుడు. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత. బెల్లంకొండ సురేష్‌ సమర్పకులు. ఈ సినిమాకు 'అల్లుడుశీను' అనే పేరు ఖరారు చేశారు. పూర్తి కామెడీతో చిత్రాన్ని తెరకెక్కించారని చెప్తున్నారు.

Brahmi Comedy to be highlight in Alludu Srinu Film

దర్శకుడు వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ '' హీరోగా అడుగుపెట్టే యువకుడికి సరైన సినిమా ఇది. ఓ హీరో నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. వీరి మధ్య 'అల్లుడుశీను' అనే పదం చాలా సార్లు వస్తుంది. అందుకే ఈ పేరు సినిమాకు ఖరారు చేశాం. కథానాయకుడు, బ్రహ్మానందం పాత్రల మధ్య సాగే సన్నివేశాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఆద్యంతం నవ్వులు పూయించేలా సినిమా ఉండబోతోంది. తమన్నా ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది'' అన్నారు.

''నా కొడుకు సాయిశ్రీనివాస్‌ను పరిచయం చేయడానికి ఆలోచనలు చేస్తున్నప్పుడు వినాయక్‌ ముందుకొచ్చాడు. అందరూ మెచ్చేలా నా కొడుకును తీర్చిదిద్దాడు. సినిమాకు ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. వారందరి కృషి ఫలితం సినిమా బాగా వచ్చింది. ఈ నెల 29న పాటలను విడుదల చేస్తున్నాం. వచ్చే నెల 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు బెల్లంకొండ సురేష్‌.

English summary
Ramanaidu made the film 'Kaliyuga Pandavulu' with top technicians. In the same way, Bellamkonda Suresh produced 'Alludu Seenu'. The shooting has neared completion.This film will have comedy, action and love in abundance
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu