For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'యాక్షన్‌ 3D' లో ఎమ్.ఎస్, బ్రహ్మానందం, అలీ పాత్రలు

  By Srikanya
  |

  హైదరాబాద్ : 3డి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న చిత్రం 'యాక్షన్‌'. అల్లరి నరేష్‌, వైభవ్‌, శ్యామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, ఎమ్.ఎస్ నారాయణ పాత్రలు డిఫెరెంట్ గా ఉండనున్నాయి. వారి పాత్రలు ఏమిటంటే...మాగ్నెట్ మామ, బొక్కా బాబు, ఎటిఎమ్ జాక్సన్. ఈ పాత్రలు పూర్తి కామెడీని పంచనున్నాయని సమాచారం. అనిల్‌ సుంకర దర్శకుడు. వచ్చే నెలలో ఈ సినిమా తెర మీదకు వస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనుకొంటున్నారు.

  అంతేగాక ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, జల్సా లో టైటిల్ సాంగ్స్ పాడిన బాబా సెహగల్ చేత మామ అంటూ సాగే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరించారు. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ వింతగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

  ఇతర వివరాల్లోకి వెళితే... ఈ సినిమా విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోంది. ఈ చిత్రం విశాఖ ఏరియాకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 'గాయత్రి దేవి ఫిల్మ్స్' సంస్థ రూ. 1 కోటి చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం. వైజాగ్ ఏరియాలో అల్లరి నరేష్ సినిమాకు ఈ రేంజిలో రేటు రావడం ఇదే తొలిసారి. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ స్టేజీకి చేరుకుంది. సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  దర్శకుడు అనిల్ ఈచిత్రం గురించి చెబుతూ... తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రం రెండు నెటివిటీలకు దగ్గరగా ఉంటుందని, వేర్వేరుగా చిత్రీకరిస్తున్నామన్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ... సరికొత్త 3డి వెర్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమ యూనిట్‌కు మంచి పేరు తీసుకువచ్చేలా ఉంటుందని తెలిపారు. తండ్రీతనయులు బప్పా, బప్పీలహరి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం ఓ విశేషం. రీరికార్డింగ్‌తో పాటు తమన్‌ ఓ పాటకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

  రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి. 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.

  English summary
  Allari Naresh, Neelam Upadhyaya, Sneha Ullal, Kamna Jethmalani's 'Action 3D' directed by Anil Sunkara is progressing at brisk pace. According to latest the film makers released the trailer and it revealed the names of comedians Brahmanandam, MS.Narayana and Ali. They will be entertaining as Magnet mama, Bokka Babu, ATM Jackson. The film's Tamil version is titled 'O Podu 3D' and will have special appearances of Simbhu and Santhanam. Tamil version will be releasing in the first week of June. Bappa, Bappi Lahari scored music for the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X