మళ్లీ వివాదంలో దువ్వాడ జగన్నాథం.. మంత్రికి ఫిర్యాదు

దువ్వాడ జగన్నాథం చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని మళ్లీ వివాదం చుట్టుకొన్నది.

By Rajababu

దువ్వాడ జగన్నాథం చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని మళ్లీ వివాదం చుట్టుకొన్నది. అభ్యంతరకరమైన పదాలను తీసివేస్తామని దర్శకుడు హరీశ్ శంకర్ ఇచ్చిన హామీ తుంగలో తొక్కారని బ్రహ్మాణ సంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు సంఘాల ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ నటించిన డీజే చిత్రంలోని 'గుడిలో బడిలో మడిలో' అంటూ సాగే పాట విషయంలో వివాదం రేగిన విషయం తెలిసిందే.

కొనసాగుతున్న వివాదం

కొనసాగుతున్న వివాదం

దువ్వాడ జగన్నాథం చిత్రం జూన్ 23 న విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదలకు 10 రోజుల సమయమే ఉన్నా ఈ చిత్రాన్ని వివాదాలు వీడడం లేదు. డీజే లోని గుడిలో బడిలో మడిలో పాటలో అభ్యంతరకర పదాలు వాడారని బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వీరు చిత్ర యూనిట్ ని ఆ పదాలు తొలిగించాలని కోరారు. తాము ఎంత చెప్పినా ఆ పదాలను తొలగించ లేదని వారు మండిపడ్డారు.

సాహితీ రచన వివాదాస్పదం.

సాహితీ రచన వివాదాస్పదం.

గుడిలో బడిలో మడిలో ఒడిలో అనే పాటను సినీ గేయ రచయిత సాహితి రాశారు. ఆ పాటలో ఆశగా నీకు పూజలే చేయగా ఆలకించింది ఆ నమకం. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అంటూ హీరోయిన్‌ను హీరో వర్ణించడంపై బ్రహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అభ్యంతరకరమైన పదాలను

అభ్యంతరకరమైన పదాలను

ఈ పాటలోని అభ్యంతరకరమైన పదాలతోపాటు అగ్రహారం, తమలపాకు అనే పదాలను కూడా తొలగిస్తామని దర్శకుడు హరీష్ శంకర్ ఈ వివాదంపై స్పందించారు. ఆ పదాలు తొలగించకుండానే సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో మంగళవారం బ్రహ్మణ సంఘాలు మంత్రి తలసాని శ్రీనివాస్‌ను కలిశారు.

పదాలు తొలగించలేదు..

పదాలు తొలగించలేదు..

దర్శకుడు హరీష్ శంకర్ హమీ నెరవేరకపోవవడంతో బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిశారు. డీజే చిత్రానికి సంబంధించిన వివాదాన్ని మంత్రి తలసాని దృష్టికి తీసుకొచ్చారు. ఆ పాటలో అభ్యంతరకరంగా ఉన్న నమకం, చమకం అనే పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు కోరారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆ పాటలో పదాలు వాడారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

దిల్ రాజుకు 25వ చిత్రం..

దిల్ రాజుకు 25వ చిత్రం..

దువ్వాడ జగన్నాథం చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. నిర్మాణపరంగా దువ్వాడ జగన్నాథం చిత్రం ఆయనకు 25వది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక జూన్ 11న ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రం జూన్ 23న విడుదలకు సిద్ధమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X