twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు విష్ణుపై చెప్పుల దాడి, దాడి వెనక ఎవరో ఉన్నారని విష్ణు అనుమానం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మంచు విష్ణు హీరోగా రూపొందిన 'దేనికైనా రెడీ' చిత్రం వివాదం ముదిరి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. బుధవారం సాయంత్రం బ్రాహ్మణ సంఘాల నేతలు మోహన్ బాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగడంతో మోహన్ బాబు అనుచరులు వారిపై కర్రలతో దాడి చేయడం, ఈ దాడిలో కొంత మంది బ్రాహ్మణులు గాయపడటం, తమ ఇంటిపై దాడి చేయడం వల్లనే సెక్యూరిటీ సిబ్బంది దాడిని తిప్పి కొట్టారని విష్ణు మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.

    దాడి ఘటన నేపథ్యంలో.... రాష్ట్ర మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్‌సి)లో ఇటు బ్రాహ్మణులు, అటు మంచు విష్ణు పోటాపోటీగా పరస్పర ఫిర్యాదులకు దిగారు. తొలుత బ్రాహ్మణులు హెచ్చార్సీలో ఫిర్యాదు చేసారు. అక్కడికి మంచు విష్ణు రావడంతో రగిలిపోయిన బ్రాహ్మణులు అక్కడే ఆందోళన చేపట్టారు. విష్ణు వాహనంపై కొందరు చెప్పులు విసిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హెచ్చార్సీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి పంపించేసారు.

    హెచ్చార్సీ వద్ద మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ... హెచ్చార్సీలో తన ఫిర్యాదు స్వీకరించలేదని, హెచ్చార్సీ వైస్ ప్రెసిడెంట్ తర్వాత మాట్లాడతానని చెప్పారని వెల్లడించారు. దాడుల వెనక ఎవరో ఉన్నారని, సినిమా బ్రహ్మాండంగా ఆడుతోందని, కావాలనే ఇవన్నీ చేయిస్తున్నారని మంచు విష్ణు అనుమానం వ్యక్తం చేసారు. విష్ణు అనుమానాన్ని బట్టి పరిశ్రమలోని తమ ప్రత్యర్థులే దీని వెనక ఉన్నారనే డౌట్ పడుతున్నట్లు కనిపిస్తోంది. కాగా... సమయం మించి పోవడం వల్లనే ఫిర్యాదు చేయడానికి మరోసారి రావాలని విష్ణుకు హెచ్చార్సీ వైస్ ప్రెసిడెంట్ సూచించారు.

    నిన్న రాత్రి జరిగిన దాడి విషయంలో ఇటు విష్ణు, అటు బ్రాహ్మణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. తాము ఇంటి ముందు నుంచి వెళ్తుంటే వారే దాడి చేశారని బ్రాహ్మణులు ఆరోపిస్తుంటే... తమ ఇంటిపై జరిగిన దాడిని తాము తిప్పికొట్టామని విష్ణు వాదిస్తున్నారు.

    English summary
    Brahmins complaint to HRC against Manchu Vishnu's movie Denikaina Ready.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X