»   » తెలుగు ‘బిగ్ బాస్’ మనోభావాలు దెబ్బతీస్తున్నాడు: బ్రాహ్మణ సంఘాలు

తెలుగు ‘బిగ్ బాస్’ మనోభావాలు దెబ్బతీస్తున్నాడు: బ్రాహ్మణ సంఘాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమైన 'బిగ్ బాస్' వివాదంలో ఇరుక్కుంది. షోలో ఓ టాస్కలో భాగంగా హోమం వెలిగించారు. టీం సభ్యులు అది ఆరకుండా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో వారు చేసిన కొన్ని చర్యలు హిందూ సంప్రదాయాన్ని కించ పరిచేలా ఉందనే విమర్శలు వచ్చాయి.

హోమగుండం వద్ద బ్రష్‌ చేసుకుంటూ చలి మంటలు కాచుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయని, పరమ పవిత్రమైన హోమగుండాన్ని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మార్చారని, వెంటనే అలాంటి పనులు ఆపేయాలని, హైందవ జాతికి క్షమాపణ చెప్పాలని జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ సేవాసమితి డిమాండ్‌ చేసింది.

Bigg Boss Telugu : Mumaith Khan Trolled For Hugging Dhanraj
Brahmins fire on Bigg Boss show

బిగ్ బాస్ నిర్వాహకులు స్పందించని యొడల తీవ్రపరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని, దీని కోసం తాము ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరించాయి. ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా టీవీ కార్యక్రమాలు ఉండకూడదని హితవు పలికారు.

English summary
Brahmins fired on Telugu Bigg Boss show. They have alleged that big boss show organizers misusing Homagunda and damaged Hindus' sentiments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu