twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ది ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం’ మూవీపై వివాదం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సారీ టీచర్ చిత్రం వివాదం మరిచి పోక ముందే టాలీవుడ్లో మరో సినిమా వివాదం తెరపైకి వచ్చింది. 'ది ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం' పేరుతో విడుదల కాబోతున్న ఈచిత్రంపై బ్రాహ్మణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బ్రాహ్మణ స్త్రీలను కించపరిచేలా ఈ సినిమాలో కామకేళి దృశ్యాలు వున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    చలం 1937లో రాసిన 'బ్రాహ్మణీకం' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్టు దర్శక నిర్మాత చెబుతున్నారు. చలం వంటి గొప్ప వ్యక్తి రాసిన పుస్తకం పేరును అడ్డుపెట్టుకుని, బ్రాహ్మణ స్త్రీలను కించపరిచేలా సినిమాలు తీయడం పట్ల బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి.

    మరో వైపు సెన్సార్ బోర్డుపై కూడా బ్రహ్మణ సంఘాలు ఫైర్ అయ్యాయి. ఇలా ఒక కులం ప్రస్తావనతో టైటిల్ పెట్టి సినిమాలు తీస్తుంటే సెన్సార్ బోర్డు ఏం చేస్తుందని, ఇలాంటి వాటికి ఎలా అనుమతి ఇచ్చారని ఆ సంఘం నేతలు మండి పడుతూ...సినిమాను నిషేదించాలని, నిర్మాతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేసారు.

    ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘాల నేతలు మాట్లాడుతూ...సినిమా నిషేదించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. బ్రాహ్మనిజం చిత్రానికి దర్శకత్వం, నిర్మాత, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, లిరిక్స్ ఇలా అన్ని విభాగాలు జీటీ పూరి అనే ఒకే వ్యక్తి హ్యాండిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Brahmin associations all over the state have threatened to launch an agitation for banning the film 'A Woman in Brahminism' which the makers are claiming to be based on the legendary writer Chalam's novel 'Brahmanikam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X