»   » యావరేజేనా? హిట్టా? ‘బ్రహ్మోత్సవం’ టాక్ ఎలా ఉంది?

యావరేజేనా? హిట్టా? ‘బ్రహ్మోత్సవం’ టాక్ ఎలా ఉంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ మహేష్ బాబు నుండి ఫ్యామిలీ ఎంటర్టెనర్ వస్తుందంటే అభిమానుల్లో, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. గతంలో తనకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి హిట్ అందించిన శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కావడంతో తాజాగా విడుదలైన 'బ్రహ్మోత్సవం'పై అంచనాలు భారీగా ఉన్నాయి.

అందుకే సినిమాకు భారీగా ముందస్తు బుకింగ్స్ జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఉదయం 8 గంటలకే స్పెషల్ షోలు వేయగా, ఏపీలో కూడా భారీ సంఖ్యలో బెనిఫిట్ షోలు వేసారు. యూఎస్ఏలోలో ప్రీమియర్ షోలో కూడా భారీగానే పడ్డాయి.


Brahmostavam movie public talk

తాజాగా సినిమా టాక్ ఏమిటో బయటకు వచ్చేసింది. సినిమా ఊహించిన స్థాయిలో లేదని చాలా మంది నుండి వచ్చిన అభిప్రాయం. చాలా మంది సినిమా యావరేజే అని అంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం స్క్రీన్లే ఆసక్తికరంగా లేక పోవడమే అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎంచుకున్న కాన్సెప్టు ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ దాన్ని ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదని అంటున్నారు. సినిమాలో మహేష్ బాబు, రావు రమేష్ పెర్ఫార్మెన్స్ చాలా బావుందని, ఇంటర్వెల్ ఎపిసోడ్, మిక్కీజే మేయర్ సాంగ్స్, రత్నవేలు సినిమాటోగ్రఫీ హైలెట్ గా ఉన్నాయని అంటున్నారు.


Brahmostavam movie public talk

సినిమాలో తొలి 30 నిమిషాలు నాలుగు సాంగులతో నింపేసారు. మహేష్ బాబు ఇంట్రడక్షన్ కోసం మధురం సాంగ్, మహేష్ బాబు-కాజల్ కాంబినేషన్లో నాయుడోరి సాంగ్, తర్వాత వచ్చింది కదా అవకాశం సాంగులు వెంట వెంటనే రావడం కూడా కాస్త ప్రేక్షకులు డీలా పడటానికి కారణం అయిందని అంటున్నారు.


అయితే సినిమాలో డైలాగులు శ్రీకాంత్ అడ్డాల స్టైల్ లో బావున్నాయనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ ఎండింగులో కుటుంబం విడిపోవడంతో ఎమోషనల్ సీన్లతో ఫ్యామిలీ ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు దర్శకుడు. స్ట్రాంగ్ క్యారెక్టర్లతో శ్రీకాంత్ అడ్డాల ఎమోషనల్ నేరేషన్ కొనసాగించాడు. తొలి సగంతో పోలిస్తే రెండో సగం బెటర్ గానే ఉందట. అయితే స్క్రీన్ ప్లే బెటర్ గా ఉంటే సినిమా మరింత బావుండేదని అంటున్నారు.

English summary
Brahmostavam movie public talk avarage. Brahmotsavam is an upcoming Indian Telugu-language drama film written and directed by Srikanth Addala which is produced by Prasad V Potluri under the banner PVP cinema, it features Mahesh Babu, Kajal, Samantha.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu