»   » ‘బ్రహ్మోత్సవం’ ఆడియో రిలీజ్ హైదరాబాద్‌లో చేయడం లేదు!

‘బ్రహ్మోత్సవం’ ఆడియో రిలీజ్ హైదరాబాద్‌లో చేయడం లేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత సినిమా వాళ్లు కూడా తమ రూటు మార్చారు. అంతకు ముందు దాదాపు అన్ని సినిమా ఫంక్షన్లు హైదరాబాద్ లోనే చేసే వారు. అయితే ఇపుడు హైదరాబాద్ తో పాటు ఏపీలో కూడా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆడియో ఫంక్షన్లు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం లాంటి సిటీల్లో నిర్వహించారు.

తాజాగా మహేష్ బాబు హీరోగా చేస్తున్న ‘బ్రహ్మోత్సవం' ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా హైదరాబాద్ లో కాకుండా తిరుపతిలో చేయాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాలు అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది తిరుపతి. అందుకే ఈ సినిమా ఫంక్షన్ ఇక్కడ నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.


'Brahmotsavam' audio release in Tirupathi

సూపర్ హిట్ 'శ్రీమంతుడు' చిత్రం తర్వాత మహేష్‌ బాబు చేస్తున్న సినిమా 'బ్రహ్మోత్సవం' . పి.వి.పి. సినిమా పతాకంపై ఈ చిత్రం రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. న్యూ ఇయిర్ కానుకగా జనవరి 1న బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.


మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : ఆర్.రత్నవేలు, సంగీతం : మిక్కీ జె. మేయర్, డాన్స్ : రాజు సుందరం, ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సందీప్ గుణ్ణం, నిర్మాతలు : పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ,స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల.

English summary
Reports have also arrived that Prasad V Potluri, the producer of the film is contemplating to launch the audio of Brahmotsavam in Tirupathi.
Please Wait while comments are loading...