మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ ఆడియో లాంచ్ (లైవ్)
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రానికి మిక్కీజే మేయర్ సంగీతం అందించారు. ఆడియో వేడుక ఈ రోజు(మే 7) సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో అభిమానుల మధ్య వైభవంగా ఆడియో వేడుక జరుగుతోంది. ఆడియో వేడుక లైవ్ చూసేందుకు క్రింది వీడియోపై క్లిక్ చేయండి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆడియో ట్రాక్ లిస్టు కూడా రిలీజైంది. సినిమాలో మొత్తం 7 పాటలు ఉన్నాయి. ఇందులో ఓ పాటను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల స్వయంగా రాసారు. అందుకు సంబంధించిన వివరాలు ఓ లుక్కేద్దాం...
1. వచ్చింది కదా అవకాశం
సింగర్: అభయ్ జోద్భూకర్
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
2. మధురం మధురం
సింగర్స్: పద్మ, శ్రీదేవి
రచన : మధురాష్టకం నుండి ఈ సాంగును తీసుకున్నారు
3. బ్రహ్మోత్సవం
సింగర్: శ్రీరామ చంద్ర
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
4. ఆట పాటలాడు
సింగర్: కార్తీక్
రచన: శ్రీకాంత్ అడ్డాల

5. నాయుడోరింటికాడ
సింగర్: అంజనా సౌమ్య, రమ్య మెహారా
రచన: జానపదాల నుండి తీసుకుంది
6. బాల త్రిపురమణి
సింగర్: రాహుల్ నంబియార్
రచన: కృష్ణ చైతన్య
7. ఫుట్ యువర్ హ్యాండ్స్ అప్
సింగర్స్: శ్రావణ భార్గవి, మిక్కీ జే మేయర్
రచన: కృష్ణ చైతన్య
మ్యూజీషియన్స్ డిటేల్స్...
కీబోర్డ్ ప్లేయర్: మిక్కీజే మేయర్, రిథమ్ ప్రోగ్రామింగ్: వెంకటష్ పట్వారి, గిటార్: అరుణ్ చిలువేరి, కోరస్: రమ్య, సాయి శివాని, కృష్ణ చైతన్య, అరబిక్ రిథమ్స్: సుఫి జబీన్, అడిషనల్ ఫ్రోగ్రామింగ్: అరుణ్ మిస్సల్, ఆల్ సాంగ్స్ మిక్డ్ బై మిక్కీ జే మేయర్, ఆల్బమ్ మాస్టర్డ్ బై డారెన్ వెర్మాస్(యూఎస్ఏ).
సినిమాకు సంబంధించి వివరాల్లోకి వెళితే పివిపి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహేష్ బాబుకు చెందిన మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











