»   » కుమ్మేస్తున్న బ్రహ్మోత్సవం: ప్రీ రిలీజ్ బిజినెస్ కే షాక్ అయి పోతున్న టాలీవుడ్

కుమ్మేస్తున్న బ్రహ్మోత్సవం: ప్రీ రిలీజ్ బిజినెస్ కే షాక్ అయి పోతున్న టాలీవుడ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మే నెల తోనే టాలీవుడ్ లో 'బ్రహ్మోత్సవం' మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌, సాంగ్ టీజర్స్ కు ఊహించినదానికన్నా ఎక్కువ స్పందనే వస్తోంది. దీనితో సూపర్ స్టార్ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. "బ్రహ్మాత్సవం" సూపర్ హిట్ అవటం ఖాయం అన్నంత ధీమా కనిపిస్తోంది ప్రతీ ఒక్కరి లో..

ఇది ఇలా ఉండగా ఈసినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను చూసి టాలీవుడ్ షాక్ అయి పోతున్నట్లు టాక్. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఇప్పటి వరకూ జరిగిన బిజినెస్ ఎంతొ తెలుసా..? అక్షరాలా 72 కోట్ల పై మాటే. నిజం ఈ సినిమా ప్రపంచవ్యాప్త ధియేటర్ రైట్స్ 72 కోట్లకు అమ్ముడయ్యాయి అని తెలుస్తోంది.


ఇక ఇప్పటి వరకూ జరిగిన బిజినెస్ కి ఆడియో, శాటిలైట్, డబ్బింగ్ వెర్షన్ రైట్స్, కూడా కలిపితే.....!? వంద కోట్ల బిజినెస్ మార్కుని ఈజీగా అందుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిన ఈసినిమా బయ్యర్లు కూడా సరైన లాభాలతో బయట పడాలీ అంటే.. ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్ల కలక్షన్స్ వసూలు చేయగలిగితేనే సాధ్యపడుతుందంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు..


Brahmotsavam Huge Pre-Release Business 76 Crores

అయితే ఆ రెంజ్ కి 'బ్రహ్మోత్సవం' చేరగలుగుతుందా.. అన్నదే ప్రశ్న. ఈ విషయమై ఒక క్లారిటీరావాలంటే మే 7న ఈసినిమా ఆడియో విడుదల అయ్యే దాకా ఆగాల్సిందేనట. ఈవార్తలు ఇలా ఉండగా కొద్దిరోజుల క్రితం చిత్రం విడుదలయిన మోషన్ పోస్టర్ రాజస్దాన్ టూరిజం యాడ్ కు కాపీగా ఉంది అని కామెంట్స్ వచ్చాయ్... అంతేకాదు నిన్న విడుదల అయిన టీజర్ లోని 'మధురం మధురం' పాట లిరిక్ మొత్తం మధురాష్టకం నుంచి కాపీ కొట్టారు అనే నెగెటివ్ టాక్ కూడా వచ్చింది..


ఏదేమైనా భారీ బిజినెస్ తో పాటు మార్కెట్లో భారీ అంచనాలు పెంచుకున్న ఈ 'బ్రహ్మోత్సవం' హిట్ కాకపోతే, ఈసినిమాని నమ్ముకున్న చాలామంది బయ్యర్లు నష్టపోయే అవకాశం ఉంది..

English summary
Mahesh Babu Brahmotsavam Movie Pre-Release Business to reach sky high
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu