»   » ‘బ్రహ్మోత్సవం’: మహేష్ ఫ్యాన్స్ హంగామా! (ఫోటోస్)

‘బ్రహ్మోత్సవం’: మహేష్ ఫ్యాన్స్ హంగామా! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో అందరికీ తెలిసిందే. బ్రహ్మోత్సవం సినిమా విడుదల సందర్భంగా గురువారం రాత్రి నుండే అభిమానుల హడావుడి మొదలైంది. థియేటర్ల వద్ద బేనర్లు కడుతూ, రోడ్లపై ర్యాలీలు తీస్తూ ఫ్యాన్స్ హల్ చల్ చేసారు.

మహేష్ బాబు గత సినిమా 'శ్రీమంతుడు' బాక్సాఫీసు వద్ద భారీ హిట్. మరో వైపు మహేష్ బాబు-శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' భారీ హిట్. ఈ నేపథ్యంలో 'బ్రహ్మోత్సవం' చిత్రంపై ముందు నుండీ భారీ అంచనాలే ఉన్నాయి.


దీనికి తోడు గత నెల రోజుల నుండి ఈ చిత్ర నిర్మాణ సంస్థ 'పివిపి సినిమా' ప్రచార కార్యక్రమాలు భారీగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అంతా సోషల్ మీడియాకు, ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేసి సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా డిఫరెంట్ గా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.


గత పది రోజుల నుండి సినిమాకు సంబంధించిన సాంగ్ టీజర్లు, డైలాగ్ టీజర్లు, మహేష్ బాబు, సమంత, కాజల్, శ్రీకాంత్ అడ్డాల తదితరులు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసారు.


స్లైడ్ షోలో మహేష్ బాబు అభిమానుల హడావుడికి సంబంధించిన ఫోటోలు....


ఫ్యాన్స్ హంగామా

ఫ్యాన్స్ హంగామా

గురువారం రాత్రి నుండే థియేటర్ల వద్ద మహేష్ బాబు అభిమానుల హంగామా మొదలైంది.


థియేటర్లు కళకళ

థియేటర్లు కళకళ

అభిమానులు ఏర్పాటు చేసిన భారీ బేనర్లతో థియేటర్లు కళకళలాడుతున్నాయి.


శ్రీకాంత్ అడ్డాల

శ్రీకాంత్ అడ్డాల

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


భారీ తారాగణం

భారీ తారాగణం

ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే భారీ తారాగణం.


ఫ్యామిలీ ఎంటర్టెనర్

ఫ్యామిలీ ఎంటర్టెనర్

మహేష్ బాబు సినిమాలంటే ఫ్యామిలీ ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఉంది. పైగా ఇది ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.


భారీగా రిలీజ్

భారీగా రిలీజ్

పివిపి సంస్థ ఈ చిత్రాన్ని మహేష్ బాబు గత సినిమాల కంటే భారీగా రిలీజ్ చేసింది.


రికార్డులు ఖాయం

రికార్డులు ఖాయం

ఓపెనింగ్స్ పరంగా మహేష్ బాబు సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.


టాక్

టాక్

అయితే తొలి రోజు ఉదయం షో పడ్డ తర్వాత సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది.


ఓవర్ సెంటిమెంట్

ఓవర్ సెంటిమెంట్

అయితే సినిమాలో ఓవర్ సెంటిమెంట్ ఉందని కొందరు అంటున్నారు.


ఫ్యామిలీ ప్రేక్షకులు కనెక్ట్ అయితే...

ఫ్యామిలీ ప్రేక్షకులు కనెక్ట్ అయితే...

అయితే ఈ సినిమాకు ఫ్యామిలీ ప్రేక్షకులు కనెక్ట్ అయితే సినిమా భారీ విజయం సాధిస్తుంది.


అంటతా ఆసక్తి

అంటతా ఆసక్తి

బ్రహ్మోత్సవం ఫలితాలను బట్టే టాలీవుడ్లో ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టెనర్స్ ఇకపై వస్తాయా? రావా? అనేది ఆధార పడి ఉంది.


English summary
Check out Mahesh Babu Fans Hungama at Brahmotsavam theatures. Brahmotsavam is an upcoming Indian Telugu-language drama film written and directed by Srikanth Addala which is produced by Prasad V Potluri under the banner PVP cinema, it features Mahesh Babu, Kajal, Samantha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu