»   » బ్రహ్మత్సవం: ఫ్యాన్స్‌కి అసంతృప్తి, వాళ్లకీ ఇబ్బందే...(న్యూ పోస్టర్లు)

బ్రహ్మత్సవం: ఫ్యాన్స్‌కి అసంతృప్తి, వాళ్లకీ ఇబ్బందే...(న్యూ పోస్టర్లు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. మే 7న సినిమా ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే సినిమా రిలీజ్ ఇప్పటికే చాలా ఆసల్యం అయిందని అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఫ్యాన్స్ మరికొన్ని రోజులు అసంతృప్తిలోనే గడపక తప్పేట్లు లేదు. సినిమా మరో నెల రోజుల వరకు రిలీజ్ అయ్యే అవకాశాలే కనిపించడం లేదు.

కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర పీఆర్ఓ బిఏ రాజు 'బ్రహ్మోత్సవం' మే 20న వస్తుందని ప్రకటించినప్పటికీ....విడుదల ఆరోజు సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాక పోవడం వల్లనే ఈ ఆలస్యం అని అంటున్నారు. మే 27న సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.


ఈ సినిమా వాయిదా పడటం వల్ల కేవలం అభిమానులు మాత్రమే కాదు...ఇతర సినిమా షెడ్యూల్స్ కూడా గందరగోళంలో పడే పరిస్థితి నెలకొంది. మే నెలలోనే సాయి ధరమ్ తేజ్ 'సుప్రీమ్', త్రివిక్రమ్-నితిన్ చిత్రం 'అ..ఆ' విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. బ్రహ్మోత్సవం వాయిదా పడటం వల్ల ఇపుడు వారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.


అయితే అప్పటి వరకు అభిమానులను కూల్ చేయడానికి... సినిమాకు సంబంధించిన కొస్తపోస్టర్లు రిలీజ్ చేసారు. అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వీటిని చూసి సంతృప్తి పడమని చెప్పకనే చెప్పారు. స్లైడ్ షోలో బ్రహ్మోత్సవం చిత్రానికి సంబంధించిన న్యూ పోస్టర్స్...


బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం

మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'.


ఆ సీన్లు లేవు

ఆ సీన్లు లేవు

ఈ సినిమాలో మహేష్ బాబు ఒక్క ఫైట్ సీన్ కూడా చేయలేదట. సాధారణంగా మహేష్ బాబు ప్రతి సినిమాలోనూ యాక్షన్ సీన్లు ఉంటాయి. మహేష్ గత చిత్రం 'శ్రీమంతుడు'లో మహేష్ బాబు యాక్షన్ సీన్లు అదరగొట్టారు. కానీ ఇందులో లేవట.


డిఫరెంట్

డిఫరెంట్

ఈ సినిమా మహేష్ బాబు గత సినిమాలతో పోలిస్తే డిఫరెంటుగా ఉండబోతోంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమా విభిన్నంగా ప్రజెంట్ చేయబోతున్నారు.


బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం

'బ్రహ్మోత్సవం చిత్రాన్ని ప్రసాద్ వి పొట్లూరి 'పివిపి' బేనర్లో నిర్మిస్తున్నారు. మహేష్ బాబుకు చెందిన జి.మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఉంది.


నటీనటులు

నటీనటులు

మహేష్ బాబు సరసన కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యరాజ్, జయసుధ, నరేష్, రేవతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.


తెర వెనక

తెర వెనక

మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా చేస్తున్నారు.


English summary
Going by the latest update from the film circles, Mahesh Babu's Brahmotsavam will release on 27 May. Only a couple of days ago, the film's official PRO, B A Raju has confirmed that the film will hit screens on 20 May.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu