»   » మహేష్ ‘బ్రహ్మోత్సవం’ కొంటే ఆ రెండు సినిమాలు ఉచితం!

మహేష్ ‘బ్రహ్మోత్సవం’ కొంటే ఆ రెండు సినిమాలు ఉచితం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా నిర్మాతలకు మంచి ఆదాయం తెచ్చే వాటిల్లో శాటిలైట్ రైట్స్ కూడా ఒకటి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే దాదాపు రూ. 8 నుండి 10 కోట్లు శాటిలైట్ రూపంలో వస్తున్నారు. అంటే దాదాపు 20 శాతం పెట్టుబడి శాటిలైట్ రైట్స్ ద్వారా రికవరీ అవుతుందన్నమాట.

అయితే ఏ సినిమా శాటిలైట్ బిజినెస్ అయినా.... సినిమా విడుదల ముందే ఎక్కువగా జరుగుతుంది. నిర్మాతలు కూడా సినిమా విడుదల ముందు శాటిలైట్ రైట్స్ అమ్మడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా చేయని పక్షంలో ఒక వేళ సినిమా బాక్సాఫీసు వద్ద ఏదైనా తేడా కొడితే ఆ సినిమా శాటిలైట్ రైట్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు.


అయితే టీవీ ఛానల్స్ మధ్య పోటీ ఉండటంతో.... సినిమా విడుదల ముందే దక్కించుకోవడానికి కోట్లు గుమ్మరిస్తున్నాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత కొనే ముందు చాలా ఆలోచిస్తున్నాయి. సినిమా హిట్టయితే ఒక రేటు, ప్లాప్ అయితే ఒక రేటు, ప్లాప్ అయితే అసలు కొనడానికే ఇష్టపడటం లేదు.


'Brahmotsavam' Producer's Buy 1 Get 3 Offer!

ఇలా శాటిలైట్ రైట్స్ ఆశించిన ధరకు అమ్ముడు పోని చిత్రాలను విక్రయించేందుకు నిర్మాతలు సరికొత్త ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా పివిపి సంస్థ ఓ ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థ నిర్మిస్తున్న ‘బ్రహ్మోత్సవం' చిత్రం శాటిలైట్ రైట్స్ విషయంలో 'Buy 1 Get 3' ఆఫర్ ప్రకటించింది. బ్రహ్మోత్సవం సినిమాతో పాటు ఆ సంస్థ నుండి వచ్చిన ప్లాప్ చిత్రాలు వర్ణ, సైజ్ జీరో చిత్రాలు కూడా అమ్మకానికి పెట్టారు.


బ్రహ్మోత్సవం సినిమా శాటిలైట్ రైట్స్ కావాలంటే ఆ రెండు చిత్రాలను కూడా కొనాలని.... ఈ మూడింటికి కలిపి ఎవరు ఎక్కువ రేటు ఇస్తే వారికే అమ్ముతామంటూ కొత్త ముడి పెట్టారట. అయితే ఈ మూడు చిత్రాలకు కలిపి పివిపి సంస్థ చెబుతున్న రేటు చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు.

English summary
Makers of 'Brahmotsavam' has announced a 'Buy 1 Get 3' Offer to capitalize on the demand. The channel which bids the highest amount for acquiring Satellite Rights of this Mahesh starrer will be able to receive both 'Varna' and 'Size Zero'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu