»   » మహేష్ ‘బ్రహ్మోత్సవం’ ఇప్పట్లో లేనట్లే?

మహేష్ ‘బ్రహ్మోత్సవం’ ఇప్పట్లో లేనట్లే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మ‌హేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ బ్యాన‌ర్‌పై పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ ‘బ్రహ్మోత్సవం' సినిమా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు మహేష్ బాబుకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో హిట్ అందించిన దర్శకుడు కావడంతో ‘బ్రహ్మోత్సవం' సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ సినిమాను జ‌న‌వ‌రి 8, 2016 అని రిలీజ్ చేస్తామ‌ని అప్పట్లో ప్ర‌క‌టించారు. సంక్రాంతి పండగకు సినిమా వస్తుందనే ఆశతో చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమా అనుకున్నట్లుగా సంక్రాంతికి విడుదల చేయడం లేదు. వివిధ కారణాలతో సినిమా అప్పటికి పూర్తయ్యే అవకాశం లేక పోవడంతో మార్చి 25, 2016న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సినిమా షూటింగ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బ్ర‌హ్మోత్స‌వం షూటింగ్ ఆగ‌స్ట్ 18 నుంచి మొద‌లుపెట్ట‌నున్నాడు.

Brahmotsavam release date pushed back

వాస్తవానిక ఈ సినిమా షూటింగ్ జులై 10 నుండి మొదలు కావాల్సి ఉంది. అయితే ‘శ్రీమంతుడు' విడుదల ఆలస్యం కావడంతో ‘బ్రహ్మోత్సవం' షూటింగ్ కూడా అనుకున్న సమయానికి మొదలు కాలేదు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ ఇదే అంటూ ఓ ప్రచారం మొదలైంది. ఆ వివరాల ప్రకారం....‘సత్యరాజ్, రేవతి ఈ చిత్రంలో మహేష్ బాబు తల్లిదండ్రుల పాత్రలో కనిపించనున్నారు. ఇదో ఫ్యామిలీ స్టోరీ. తండ్రి(సత్యరాజ్), కొడుకు(మహేష్ బాబు) మధ్య బంధాన్ని ఈచిత్రంలో అద్భుతంగా ప్రజెంట్ చేయబోతున్నారట. తల్లి(రేవతి) కుటుంబానికి సంబంధించిన అంశాలు సినిమాలో కీలకం. ముగ్గురు హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. కుటుంబ విలువల గురించి హీరో ఎలా రియలైజ్ అయ్యాడు అనేది మెయిన్ కాన్సెప్టని అంటున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చేస్తారు. తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Mahesh Babu's next film Brahmotsavam release date pushed back. It may be releasing on March 25, 2016.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu