»   » లాస్ భయం? ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్ మార్పు (న్యూ వర్కింగ్ స్టిల్స్)

లాస్ భయం? ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్ మార్పు (న్యూ వర్కింగ్ స్టిల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు బాగున్నాయి. అయితే అంచనాలు అందుకోవటం దర్శకులు, హీరో, టెక్నీషియన్స్ భాధ్యత అయితే సినిమాని సరైన టైమ్ లో రిలీజ్ చేసి, హిట్ చేయటం నిర్మాతల అవసరం.

ఈ చిత్రం ఆడియో మే 7 న రిలీజ్ చేసి మే 27న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఇపుడు రిలీజ్ చేస్తే సినిమాకు లాస్ ఏర్పడుతుందనే భయంతో ఉన్నారట నిర్మాతలు. ఎందుకంటే జూన్ మొదటి వారంలో పాఠశాలలు ప్రారంభం అవుతాయి. అంతా పిల్లలను స్కూల్లో జాయిన్ చేయించడం, ఇతర హడావుడిలో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా కోసం ఫ్యామిలీ ప్రేక్షకులు సమయం కేటాయించడం కష్టమే.


ఈ విషయాన్ని గ్రహించిన మహేష్ బాబు అండ్ టీం మరో వారం ముందుగానే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మే 20న బ్రహ్మోత్సవం రిలీజ్ చేయడానికి మహేష్ బాబు అండ్ టీం శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.


మహేష్ బాబు డబ్బింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. మిక్కీ జె మేయర్ రీ-రికార్డింగ్ చివరి దశకు చేరుకుందని, ఆయనకు బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మణిశర్మ సహకారం అందిస్తున్నట్లు సమాచారం. ఆడియో వేడుకలో రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది.


స్లైడ్ షోలో 'బ్రహ్మోత్సవం' చిత్రానికి సంబంధించిన న్యూ వర్కింగ్ స్టిల్ష్...


మహేష్, పివిపి

మహేష్, పివిపి

మహేష్ బాబు సంబంధించిన ‘మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్', పివిపి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


ఫ్యామిలీ మూవీ

ఫ్యామిలీ మూవీ

వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ముగ్గురు హీరోయిన్స్ కు పాత్రలకూ ప్రాధాన్యముంది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది''అన్నారు.


బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం

మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'.


ఆ సీన్లు లేవు

ఆ సీన్లు లేవు

ఈ సినిమాలో మహేష్ బాబు ఒక్క ఫైట్ సీన్ కూడా చేయలేదట. సాధారణంగా మహేష్ బాబు ప్రతి సినిమాలోనూ యాక్షన్ సీన్లు ఉంటాయి. మహేష్ గత చిత్రం 'శ్రీమంతుడు'లో మహేష్ బాబు యాక్షన్ సీన్లు అదరగొట్టారు. కానీ ఇందులో లేవట.


విభిన్నం

విభిన్నం

ఈ సినిమా మహేష్ బాబు గత సినిమాలతో పోలిస్తే డిఫరెంటుగా ఉండబోతోంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమా విభిన్నంగా ప్రజెంట్ చేయబోతున్నారు.


హీరోయిన్లు

హీరోయిన్లు

నటీనటులు మహేష్ బాబు సరసన కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యరాజ్, జయసుధ, నరేష్, రేవతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.


English summary
According to the latest buzz, May 20 is being considered for the Brahmotsavam’s release. We can expect an official announcement during the audio release function tomorrow.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu