»   »  బ్రహ్మోత్సవం: తెలంగాణలో ఉన్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

బ్రహ్మోత్సవం: తెలంగాణలో ఉన్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' ఈ నెల 20న గ్రాండ్ గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సినిమాను తొలి రోజు తొలి షో చూడాలని చాలా మంది అభిమానులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఉదయం పూట వేసే స్పెషల్ షోలు కేవలం కొన్ని చోట్లకు మాత్రమే పరిమితం అవ్వడం వల్ల చాలా మంది అభిమానులు నిరాశతో వెనుదిరగడం లాంటి సంఘటనలు గతంలో చాలా సార్లు చూసాం.

అయితే 'బ్రహ్మోత్సవం' విషయంలో మాత్రం అభిమానులకు ఒక గుడ్ న్యూస్. నైజాం ఏరియాలో 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ అన్ని థియేటర్ల ఉదయం 8.10కు అభిమానుల కోసం స్పెషల్ షో వేయాలని నిర్ణయించింది. తొలి రోజు(మే 20)న మాత్రమే ఈ స్పెషల్ షో వేస్తున్నారు.

Brahmotsavam special morning show 8:10 am onwards

అంటే హైదరాబాద్ తో పాటు తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మోత్సవం విడుదలవుతున్నఅన్ని థియేటర్లలో ఉదయం 8.10 గంటలకు స్పెషల్ షో వేస్తున్నారన్నమాట. దీంతో వీరాభిమానులు ఎక్కువ మందికి బ్రహ్మోత్సవం స్పెషల్ షో చూసే అవకాశం దక్కబోతోంది. ఈ విషయాన్ని అభిషేక్ పిచ్చర్స్ వారు అఫీషియల్ గా ప్రకటించారు.

ప్రస్తుతం మూవీ టీం అంతా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. మే 20 'బ్రహ్మోత్సవం' చిత్రం విడుదలవుతోంది. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు సంబంధించిన 'మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్', పివిపి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది. సత్యరాజ్, జయసుధ, నరేష్, రేవతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

English summary
Good news for all Mahesh Babu fans and audience . Enjoy Brahmotsavam special morning show (8:10 am onwards) in all single screens across Hyderabad and Telangana districts on May 20th !!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu