Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’
హైదరాబాద్: ఇ.వి.వి సత్యనారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న హిలేరియస్ కామెడీ ఎంటర్టెనర్ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ'. అల్లరి నరేష్-మోనాల్ గజ్జర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్ ట్విన్ సిస్టర్‌గా ‘రంగం' ఫేం కార్తీక నటిస్తోంది. ‘వీడు తేడా' ఫేం బి.చిన్ని దర్శకుడు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ' సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ చిత్రాన్ని నవంబర్ 7న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాత అమ్మిరాజు కానుమల్లి మాట్లాడుతూ..‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' సెన్సార్ పూర్తయింది. ‘యు/ఎ' సర్టిఫికెట్ పొందింది. సినిమాను నవంబర్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సెన్సార్ సభ్యులు చిత్రాన్ని చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' అల్లరి నరేష్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. కామెడీతో పాటు కుటుంబ బాంధవ్యాలకు కూడా పెద్ద పీఠ వేస్తూ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' చిత్రాన్ని దర్శకుడు బి.చిన్ని చక్కగా తెరకెక్కించారు' అన్నారు.

హర్షవర్ధన్ రాణె, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్ రెడ్డి, నాగినీడు, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, అభిమన్యు సింగ్, కెల్లీ డార్జ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, సాహిత్యం: భాస్కరభట్ల, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, ఎడిటర్ : గౌతం రాజు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, ఛాయాగ్రహణం: విజయ్ కుమార్ అడుసుమిల్లి, కథ: విక్రమ్ రాజ్, కార్యనిర్వాహక నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వర్రావు, నిర్మాత: అమ్మిరాజు కానుమల్లి, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బి.చిన్ని.