For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగచైతన్య భుజాలెక్కి అఖిల్... (ఫన్నీ ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : మొత్తానికి అక్కినేని అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ తొలి సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అఖిల్ సోదరుడు నాగచైతన్య ఇలా ఈ ఫోటోని షేర్ చేసిన తన తమ్ముడికి శుభాకాంక్షలు తెలియచేసారు. తమ అన్నదమ్ముల అనుబంధం ఇలా చూపించారు.

  నాగచైతన్య ట్వీట్ చేస్తూ.,." నా బేబీ బ్రదర్ అఖిల్ అక్కినేని కు శుభాకాంక్షలు... తొలి చిత్రం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను..రాక్ బ్రో !" అన్నారు.

  https://www.facebook.com/TeluguFilmibeat

  Brotherly bonding of Akhil-Chaitu

  ఇక మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు వివి వినాయక్ అఖిల్ తొలి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలసి యువ హీరో నితిన్ నిర్మిస్తున్నారు.ఈ వార్తను అఖిల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

  ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ... ‘గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో నేను హీరోగా పరిచయమవుతున్న సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. నా డార్లింగ్ ప్రొడ్యూసర్ నితిన్ & సుధాకర్ రెడ్డిలకు అల్ ది బెస్ట్. వీరితో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం అయినందుకు క్షమించండి.' అని అన్నారు.

  నిర్మాత నితిన్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించే అవకాశాన్ని మా చేతుల్లో పెట్టినందుకు నాగార్జున గారికి మరియు నా సోదరుడు అఖిల్ కు థాంక్స్. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. భారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మీ సపోర్ట్ కావాలి. అని అన్నారు.

  ఇక అక్కినేని అఖిల్ ను హీరోగా పరిచయం చేసే భాధ్యతను తనపై ఉంచిన నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని దర్శకుడు వివి వినాయిక్ తెలిపారు. శ్రీ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. నిన్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఈ స్క్రిప్టుని పూజలో ఉంచారు.

  వినాయిక్ మాట్లాడుతూ... ఫ్యాంటసీ నేపధ్యంలో సాగే ప్రేమ కథ ఇది. వెలిగొండ శ్రీనివాస్ అద్బుతమైన స్క్రిప్టు ఇచ్చారు. కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నారు. అమోల్ రాధోడ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలెడతాం. అభిమానులు కోరుకునే మాస్,మసాలా అంశాలన్నీ ఇందులో ఉంటాయి అన్నారు.

  అఖిల్ మాట్లాడుతూ... ‘గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో నేను హీరోగా పరిచయమవుతున్న సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. నా డార్లింగ్ ప్రొడ్యూసర్ నితిన్ & సుధాకర్ రెడ్డిలకు అల్ ది బెస్ట్. వీరితో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం అయినందుకు క్షమించండి.' అని అన్నారు.

  నిర్మాత నితిన్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించే అవకాశాన్ని మా చేతుల్లో పెట్టినందుకు నాగార్జున గారికి మరియు నా సోదరుడు అఖిల్ కు థాంక్స్. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. భారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మీ సపోర్ట్ కావాలి. అని అన్నారు.

  మరో ప్రక్కన ఇంకా హీరోగా అరంగేట్రం చేయకుండానే అక్కినేని అఖిల్‌కు ఫాలోయింగ్‌ ఎక్కువైంది. ప్రముఖ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా దూసుకుపోతున్నాడు. మెహిదీపట్నంలో సెయింట్‌ ఆన్స్‌ ఉమెన్స్‌ కాలేజీ నిర్వహించిన ‘ మేకింగ్‌ ఏ డిఫరెన్స్‌ ' అనే పరిశుభ్రత కార్యక్రమానికి అతిధిగా అఖిల్‌ వెళ్లాడు. అసలే అఖిల్‌కు లేడీ ఫాలోయింగ్‌తో పాటు లేడీ ఫ్యాన్స్‌ ఎక్కువ..అందులోనూ లేడీస్‌ కాలేజీకి గెస్ట్‌గా వెళ్లిన అఖిల్‌ చుట్టూ... బెల్లం మీద ఈగలు వాలినట్టు.. అమ్మాయిలు అఖిల్‌ చుట్టూ వాలిపోయారు.

  కొందరు షేక్‌హ్యాండ్స్‌, సెల్ఫీ ఫోటోల కోసం ఎగబడితే.. మరికొందరు అఖిల్‌ మోహం, మీసాలు, గడ్డం, వీపు తడిమి భయపెట్టారట. దీంతో కంగారుపడ్డ అఖిల్‌ ఏదోవిధంగా ఆ కాలేజీ నిర్వహించిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని బయటపడ్డాడని టాక్‌. అఖిల్‌కు అంత క్రేజ్‌ ఉంది కాబట్టే టైటాన్‌ వాచ్‌ కంపెనీ, మౌంటెన్‌ డ్యూ సాఫ్ట్‌ డ్రింక్‌ కంపెనీలు అఖిల్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకుంటున్నాయి.

  English summary
  On the eve Akhil’s brother and hero Naga Chaitanya share an excellent photo which shows their brotherly bonding. Naga Chaitanya posted on twitter, "Wishing my baby brother AkhilAkkineni8 all the very best for his debut ... Rock on bro !"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X