»   »  'బ్రూస్‌లీ': కొత్త పోస్టర్లు,వర్కింగ్ స్టిల్స్ (ఫొటోలు)

'బ్రూస్‌లీ': కొత్త పోస్టర్లు,వర్కింగ్ స్టిల్స్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రామ్‌ చరణ్‌ తేజ, రకుల్‌ప్రీత్‌ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'బ్రూస్‌లీ ది ఫైటర్‌'. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ ఫైట్‌ మాస్టర్‌గా అలరించనున్నారు. సోమవారం ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ నేడు మరో రెండు కొత్త పోస్టర్లను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అంతే కాకుండా వర్కింగ్‌ స్టిల్స్‌తో ఓ కొలాజ్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 'ఈ కొలాజ్‌ చాలా బాగుంది.. చిత్ర బృందానికి కృతజ్ఞతలు...' అంటూ రామ్‌ చరణ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తుండగా.. డివివి దానయ్య నిర్మిస్తున్నారు.


Lovely collage ...Thank my team #bruceleeTheFighter #BTF


Posted by Ram Charan on 22 September 2015

స్లైడ్ షోలో ...కొత్త పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్


యాక్షన్ ఎంటర్టైనర్

యాక్షన్ ఎంటర్టైనర్


రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ‘బ్రూస్ లీ' టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ .ఆడియో ఎప్పుడు

ఆడియో ఎప్పుడు


ప్రస్తుతం సెట్స్ పైన రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం ఆడియో ని అక్టోబర్ 16న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం.చీఫ్ గెస్ట్

చీఫ్ గెస్ట్


ఈ ఆడియో ఫంక్షన్ ని ఘనంగా జరుపుతున్నారు. చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా రానున్నారు.పవన్ కూడా

పవన్ కూడా


ఈ ఆడియో పంక్షన్ కు అవకాసముంటే పవన్ కళ్యాణ్ కూడా వస్తారని అంటున్నారు.గ్యాంగ్ లీడర్ తరహా

గ్యాంగ్ లీడర్ తరహా


ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి తరహా పాత్ర అని రచయిత గోపీ మోహన్ చెప్తున్నారు.టీజర్ కు అప్లాజ్

టీజర్ కు అప్లాజ్


"వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.దూసుకువెళ్తోంది

దూసుకువెళ్తోంది


విడుదలైన మూడు రోజుల్లోనే 1 మిలియన్ (10 లక్షల) వ్యూస్ సాధించి చెర్రీ సినిమా టీజర్ యూట్యూబ్‌లో ముందుకు వెల్తోంది.క్రేజీ హీరోయిన్

క్రేజీ హీరోయిన్


శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన క్రేజీ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.విడుదల ఎప్పుడు

విడుదల ఎప్పుడు


అక్టోబర్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్నారు.నిర్మాతలు చెప్పేదాని ప్రకారం...

నిర్మాతలు చెప్పేదాని ప్రకారం...


"బ్రూస్ లీ ...ది ఫైటర్ చిత్రం అక్టబర్ 16న విడుదల అవుతుంది. అలాగే ఈ నెలాఖరున ఆడియోని విడుదల చేస్తారు !!". అలాగే ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ఖరారు చేస్తూ నిర్మాతలు కొద్ది రోజుల క్రితంప్రకటన చేసారు.నేపద్యంలో

నేపద్యంలో


సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది. ఫన్ బాగా ఉంటుందిఇందులో ..

ఇందులో ..చరణ్‌ ఫైట్‌ మాస్టర్‌ పాత్ర పోషిస్తున్నాడు.తండ్రి కూడా...

తండ్రి కూడా...


ఇందులో చిరు ఓ 'స్టార్‌' పాత్రలో కనిపించబోతున్నారు.అదీ సీన్...

అదీ సీన్...


చిరు నటించే చిత్రానికి చరణ్‌ ఫైట్‌ మాస్టర్‌గా పనిచేసే సన్నివేశం ఒకటుందని తెలుస్తోంది.కీలకం

కీలకం


చిరు కనిపించేది కొద్దిసేపే అయినా ఈ కథకు ఆ సన్నివేశం కీలకం కానుందట. ఇది వరకు ...

ఇది వరకు ...


'మగధీర'లో చిరంజీవి, రామ్‌చరణ్‌లు కలసి సందడి చేశారు. ఆ తరవాత తెరపై ఇద్దరూ కలిసి కనిపించలేదు.ఫ్యాన్స్ పండుగ..

ఫ్యాన్స్ పండుగ..


మళ్లీ ఇన్నాళ్లకు చిరు, చరణ్‌ను ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు దక్కుతోందని వారు ఆనందపడిపోతున్నారు. 'బ్రూస్‌లీ': కొత్త పోస్టర్లు,వర్కింగ్ స్టిల్స్ (ఫొటోలు)

'బ్రూస్‌లీ': కొత్త పోస్టర్లు,వర్కింగ్ స్టిల్స్ (ఫొటోలు)


ఈ సినిమాలో రామ్ చరణ్ తన చేతిపై బ్రూస్ లీ టాటూతో కనిపించనున్నారు.


దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...


''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.నిర్మాత మాట్లాడుతూ...

నిర్మాత మాట్లాడుతూ...


''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.సంగీతం,స్క్రిప్టు

సంగీతం,స్క్రిప్టు


ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి స్క్రిప్టు అందిస్తూండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.సాంకేతిక వర్గం

సాంకేతిక వర్గం


ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.సెకండాఫ్ కామెడి

సెకండాఫ్ కామెడి


ఎప్పటిలాగే శ్రీనువైట్ల ఈచిత్రం సెకండాఫ్ ని పూర్తి కామెడితో నింపినట్లు సమాచారం.English summary
Ram Charan's "Bruce Lee" latest posters released. It is set for October 16th release. The film is likely to have it's audio unveiled soon and the date is said to September 26th.
Please Wait while comments are loading...