»   » 'బ్రూస్ లీ' విలన్ కు యాక్సిడెంట్ ...గాయాలు

'బ్రూస్ లీ' విలన్ కు యాక్సిడెంట్ ...గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'బ్రూస్ లీ' విలన్ అరుణ్ విజయ్ గుర్తుండే ఉండి ఉంటారు. ఆయన తాజాగా చక్రవ్యూహ అనే టైటిల్ తో ఓ కన్నడ చిత్రం చేస్తున్నారు. షూటింగ్ లో భాగంగా జరిగిన సీన్ లో ఆయన అనుకోని విధంగా పడి గాయపడ్డారు. ముఖానికి బాగా దెబ్బలు తగిలాయి. ఈ విషయమై ఆయన సోషల్ నెట్ వర్కింగ్ మీడియా ద్వారా అభి మానులకు తెలియచేసారు. మెడికల్ రిపోర్ట్ సైతం ఆయన జత చేసారు. మీరు ఇక్కడ చూడండి.

Beneath da glasses... 2 fractured nasal bones, a bruised eye & cheek.. accident @ #chakravyuha shoot.. Extreme pain!

Posted by Arun Vijay on 19 October 2015

నటుడు విజయ్ కుమార్-మంజుల తనయుడు అరుణ్ విజయ్. ఆ మధ్య వచ్చిన అజిత్ చిత్రం 'ఎన్నై అరిందాల్‌'(ఎంత వారుగానీ) చిత్రంలో విలన్ గా నటించిన అరుణ్‌ విజయ్‌ గుర్తుండే ఉండి ఉంటారు. ఆయన ఇప్పుడు రామ్ చరణ్ తో బ్రూస్ లీ చిత్రం చేసారు. ఆయన నిజ జీవితంలో నిర్మాత గా టర్న్ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

'ఇన్‌ సినిమాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' పేరిట ఆయన చిత్రాలు తీయనున్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ సంస్థను ప్రారంభించారు. కొత్త కళాకారులను పరిచయం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిభావంతులైనా నిరూపించుకోవడానికి అవకాశాల్లేని యువకులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

Bruce Lee Villan Arun Vijay injured while shooting

గౌతం మేనన్‌ దర్శకత్వంలో అజిత్‌ నటించిన 'ఎన్నై అరిందాల్‌'లో ప్రతినాయకుడి పాత్ర ద్వారా కోలీవుడ్‌లో అరుణ్‌ విజయ్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఆయన నటించిన 'వా' త్వరలో విడుదల కానుంది. త్వరలో గౌతం మేనన్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం శింబుతో 'అచ్చం ఎన్బదు మడమైయడా' అనే సినిమాను గౌతం మేనన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయ్యాక అరుణ్‌ విజయ్‌ కొత్త చిత్రం ప్రారంభంకానుంది. అరుణ్‌విజయ్‌ మాట్లాడుతూ.... ఏ పాత్రలో నటించినా... ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో నటించడానికి ఇష్టపడతా. నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి హీరోగా మాత్రమే నటించాల్సిన అవసరం లేదు.

అలాగే..అరుణ్ విజయ్.. ఒకప్పటి కమల్ హాసన్ మూవీ "సత్య"పై మనసు పడ్డాడు... ఈ సినిమాను రీమేక్ చేయాలని ఉందని ఇటీవల తన మనసులోని మాటను బయటపెట్టాడు.... నిరుద్యోగుల పడే ఇబ్బందులు.. సమాజంలో వారికి ఎదురైన సమస్యల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగానే ఉంటుందంటున్నాడు అరుణ్.

English summary
Arun Vijay, who was filming his debut Sandalwood flick Chakravyuha, sustained an injury to his face during the shooting of the film. The actor tweeted about this, and posted a report on his medical condition received from the hospital.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu