twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అధినాయకుడు'బడ్జెట్ టిడిపి అభ్యర్దుల ఖర్చులో

    By Srikanya
    |

    తెలుగు దేశం ప్రచారానికి బాలకృష్ణ అధినాయకుడు ఉపయోగపడేలా ఉంటే చర్యలు తప్పవని, అవసరమైతే ఆ సినిమా నిర్మాణ వ్యయాన్ని తెలుగు దేశం పార్టీ అభ్యర్దుల ఖర్చులో కలుపుతామని రాష్ట్ర ఎన్నికల్ ప్రధానాధికారి భన్వర్ లాల్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అదినాయకుడు సినిమాపై పిర్యాదు అందిందని, నిపుణల కమిటీతో ఆ సినిమాను పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ చెప్పారు.

    నందమూరి బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాలోని డైలాగులు అభ్యంతరకంగా ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికలు సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్ కు పిర్యాదు చేసారు. ఆ చిత్రం విడుదలకు నిలిపివేయాలని వారు కోరారు. రాజకీయంగా ఒక పార్టీకి లబ్ది చేకూర్చే విధంగా ఇందులో డైలాగులు ఉన్నాయని వారు తెలిపారు. పిర్యాదు చేసిన వారితో వైఎస్ ఆర్ సిపి నేతలు మాజీ మంత్రి మారెప్, మాజీ ఎమ్మల్సీ రెహమాన్, వెంకట్ ప్రసాద్ ఉన్నారు.

    అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆ సినిమా ద్వారానే ఉప ఎన్నికల ప్రచారమని బాలకృష్ణ ప్రకటించారని అన్నారు. కడప ఉప ఎన్నికల్లో బాలకృష్ణ, చిరంజీవి తొడలు కొట్టినా ఫలితాలు ఎలా వచ్చాయో అందరకీ తెలసన్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగి వ్యక్తులు చనిపోయారని, అప్పుడే కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే బాలకృష్ణ జైల్లో ఉండేవారని వారు అన్నారు.

    బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి తెరకెక్కించిన చిత్రం 'అధినాయకుడు'. ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలటీస్ పూర్తి చేసుకుని ఎ సర్టిపికేట్ పొందింది. ఈ చిత్రానికి సెన్సార్ టాక్ బాగా పాజిటివ్ గా వచ్చినట్లు సమాచారం. సినిమా ప్రారంభమైన నాటి నుంచి నెగిటివ్ టాక్ ను మూట గట్టుకున్న ఈ చిత్రం చాలా కాలంగా ఎప్పుడు రిలీజా అని అందరినీ ఊరిస్తోంది. మొత్తానికి ఈ చిత్రాన్ని జూన్ 1 న విడుదల చేయటానికి తేదిని ఫిక్స్ చేసారు. శ్రీరామ రాజ్యం వంటి భక్తి రసాత్మక చిత్రం తర్వాత ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ మూవీగా 'అధినాయకుడు' రాబోతోంది.

    ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు.గతంలో చెన్నవకేశవరెడ్డి, ఒక్క మగాడు చిత్రాల్లో ఓల్డేజ్ గెటప్ లో కనిపించిన బాలయ్య అధినాయకుడులో మరోసారి ఆ క్యారెక్టర్ చేస్తున్నారు. తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్

    English summary
    The Election Comissioner Bhanwarlal said that he would take a decision after watching Adhinayakudu movie and consulting with experts. A more serious step would be to consider the film a part of the TDP campaign. If that happens,the budget of the film would be included in the poll expenses of the candidate.The film showcases Balakrishna in three powerful roles. Saloni, Lakshmi Rai are the heroines and Jayasudha is essaying a crucial role in Adhinayakudu. The makers are planning to release the movie on June 1.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X